March 27, 202510:50:25 PM

బిగ్ లిస్ట్.. అసలు వచ్చే సంక్రాంతికి వచ్చేదెవరు?

2026 Sankranti Tollywood movie releases list

టాలీవుడ్ (Tollywood) లో పండగ సీజన్లలో సంక్రాంతి కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓ పక్క థియేటర్లు హౌస్ ఫుల్, మరోపక్క బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు.. సంక్రాంతి రేస్ అంటే నిర్మాతలకు నిజమైన పండగ. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)  హడావుడి చూసిన తర్వాత, ఇకపై సంక్రాంతి బరిలో నిలబడాలంటే ముందుగానే డేట్ లాక్ చేసుకోవాల్సిందేనని అర్థమైంది. అందుకే ఇప్పటికే 2026 సంక్రాంతికి పోటీ మొదలైంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) – ప్రభాస్ (Prabhas) మూవీ 2026 సంక్రాంతికి వస్తుందనే టాక్ ఉంది.

Tollywood

2026 Sankranti Tollywood movie releases list

కానీ ఆ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకసారి ప్రారంభమైతే, వంగా సినిమా మేకింగ్ స్పీడ్ బాగా ఉండటంతో, వేగంగా షూట్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా తమ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు సిద్ధంగా ఉంది. గత రెండు సంక్రాంతులలో పెద్ద సినిమాలను రిలీజ్ చేసిన ఈ సంస్థ, 2026లో మాత్రం సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) లాంటి యంగ్ హీరోల సినిమాలను పోటీకి పంపించే ఆలోచనలో ఉంది.

మెగాస్టార్ (Chiranjeevi)  – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో సినిమా కూడా 2026 సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది. నిర్మాత సాహు గారపాటి  (Sahu Garapati)  ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇక దిల్ రాజు (Dil Raju)  కూడా ఈ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు పెద్ద సినిమాలను సంక్రాంతికి తీసుకొచ్చిన దిల్ రాజు, 2026లో మరోసారి శతమానం భవతి 2 లాంటి సినిమాలతో తన హవాను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ‘బలగం’ (Balagam) ఫేమ్ వేణు (Venu Yeldandi) డైరెక్ట్ చేస్తున్న నితిన్ (Nithin Kumar) – ఎల్లమ్మ సినిమా కూడా 2026 సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా జనరల్‌గానే పండగ సీజన్‌కు తగిన ఎమోషనల్ మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందని సమాచారం. ఇలా చూస్తే, 2026 సంక్రాంతి కూడా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్‌గా మారనుంది. ఇంకా కొన్ని సినిమాలు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తుండగా, అసలు ఈ రేసులో ఎవరెవరు స్ట్రాంగ్ గా నిలబడతారనేది చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.