
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ప్రముఖులు భారీగా దుబాయ్ బాట పట్టారు. కారణం ఏంటా అని అంతా అనుకుంటే.. టాలీవుడ్ లో పలు సినిమాలను నిర్మించిన ఎఎంఆర్ గ్రూప్ చైర్మన్ ఏ.మహేష్ రెడ్డి తన కుమారుడి పెళ్లిని దుబాయ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ పెళ్లి వేడుకలో సినీ తారలు, బిజినెస్ మేన్లు, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ రాయల్ వెడ్డింగ్ కోసం ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి దుబాయ్ కు వెళ్లాడు.
Jr NTR
అక్కడ పెళ్లి వేడుకలో ఫుల్ జోష్ లో పాల్గొంటూ ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా పెళ్లి వేడుకకు హాజరై, ఎన్టీఆర్-ప్రణతితో కలిసి పలు ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఎఎంఆర్ గ్రూప్ చైర్మన్ ఏ.మహేష్ రెడ్డి టాలీవుడ్ కు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఆయన నిర్మించిన భక్తి చిత్రాలు శిరిడీ సాయి, ఓం నమో వెంకటేశాయ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
ఇలాంటి ప్రముఖ నిర్మాత కుటుంబంలో పెళ్లి అంటే అంగరంగ వైభవంగా జరగాల్సిందే. అందుకే దుబాయ్ లోనే డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుకలో గ్లామర్ వంతు ఎక్కువగా ఉండేలా టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరికొంతమంది టాలీవుడ్ స్టార్లు కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి ప్లాన్ చేస్తున్నారట.
ఇక ప్రొఫెషనల్ విషయాలకొస్తే.. ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం వార్ 2 షూటింగ్ ను పూర్తి చేసుకొని తన తదుపరి ప్రాజెక్ట్ ఎన్‌టీఆర్ 31 కోసం ప్రశాంత్ నీల్ తో (Prashanth Neel) కలవనున్నాడు. మరోవైపు మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి (S. S. Rajamouli) సినిమాతో బిజీగా ఉండటంతో ఈ పెళ్లికి హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి, ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ లో టాలీవుడ్ తారల సందడి యథాతథంగానే ఉందని చెప్పాలి.