
అభిమాన హీరో కనిపించగానే.. ఆ రోజుల్లో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేసేవారు. అభిమాన హీరో అనే కాదు, హీరో ఎవరు కనిపించినా అలానే చేసేవారు. హీరోయిన్లు అయితే ఇంకానూ. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా జనాలు బయట కనిపించగానే ఠక్కున మొబైల్ చేతిలోకి వచ్చేస్తోంది. ఫొటోలు, వీడియోలు తీసేస్తున్నారు. వాటిని ఫ్యాన్స్ గ్రూపులో, స్నాప్‌చాట్‌లో, వాట్సప్ స్టేటస్‌లలో పెట్టేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా అవతలి నటుడు / నటి ఎంత ఇబ్బందిపడతారో గమనించారా?
Unni Mukundan
సెల్ఫీ కోసమో, ఫొటో కోసం వచ్చే ఫ్యాన్స్‌ను చూసి కొంతమంది హీరోలు కొన్నిసార్లు చికాకు పడుతుంటారు. దానికి వాళ్లకు ఏవో కారణాలు ఉండొచ్చు. అయితే ప్రముఖ మలయాళ నటుడు రీసెంట్‌గా ‘మార్కో’తో (Marco) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఉన్ని ముకుందన్ (Unni Mukundan) చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం ఆయన ముఖాన మొబైల్ పెట్టిన ఓ వ్యక్తి చేతుల్లోంచి సెల్‌ఫోన్ లాక్కొని పాకెట్‌లో పెట్టుకున్నారు.
ఆ తర్వాత ఆయనకు ఇచ్చేశారు. ఇక్కడ ఇచ్చేశారు అనే కంటే ఆ వ్యక్తే లాక్కున్నాడు అంటే కరెక్ట్. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలా ఎలా లాక్కుంటారు అని అంటుంటే.. అలా ఎలా ముఖాన మొబైల్ పెడతారు అని మరికొందరు అనుకుంటున్నారు. రెండు వైపులా తప్పుంది అనే చర్చించుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇదేదో కావాలని చేసిన వీడియోలా ఉంది అని అనుమానిస్తున్నారు.
ఎందుకంటే హీరో పాకెట్‌లో ఫోన్‌ని తిరిగి ఇవ్వడం కాకుండా ఆయనే లాగేసుకున్నాడు. మామూలుగా ఇలా ఎవరూ చేయరు. ఒకవేళ హీరో అలా వదిలేసి ఉంటే ఏమీ చేయలేం. అయితే ఉన్ని ముకుందన్ (Unni Mukundan) బయట ఇలా కాస్త యారగెంట్‌గానే ఉంటారు అని మాలీవుడ్ అభిమానులు కామెంట్లలో చెబుతున్న మాట. మరి ఆ వీడియోలో జరిగింది నిజమేనా? ఆయనే చెప్పాలి. లేదంటే టీమ్ అయినా రియాక్ట్ అవ్వాలి.
— Southwood (@Southwoodoffl) February 22, 2025