![Ram Charan, Varun Tej and Sai Dharam Tej in one pic](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Ram-Charan-Varun-Tej-and-Sai-Dharam-Tej-in-one-pic.jpg)
ఆ మధ్య మెగా హీరోలు అందరికీ మంచి హిట్ సినిమాలు పడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమీ బాలేదు. ఎవరు ఏ సినిమాతో వచ్చినా తేడా ఫలితమే వస్తోంది. అయితే ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరించాలనే వాళ్ల ప్రయత్నం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. దానికి జిమ్ తప్పనిసరి. అలా ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి మెప్పించారు.
Ram Charan, Varun Tej, Sai Dharam Tej
ఆ ముగ్గురు తేజ్‌లతో పాటు ఉన్న మరో వ్యక్తి.. జిమ్ ట్రైనర్ రాకేశ్ ఉడియార్. ఇప్పుడు ఆ ఫొటో గురించి, అందులో ఉన్న ట్రైనర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన విషయం కంటే ముందు ఆ ఫొటోలో ఎవరున్నారో చూస్తే.. ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ చరణ్ (Ram Charan) ఉన్నాడు. ఆ సినిమా కోసం ఓ హెవీ లుక్‌కి ట్రై చేస్తున్నాడు. ఇక ‘కొరియన్ కనకరాజు’గా త్వరలో రాబోతున్న వరుణ్ తేజ్ (Varun Tej) కూడా అందులో ఉన్నాడు.
ఈ ఇద్దరితోపాటు ‘సంబరాల యేటి గట్టు’ (Sambarala Yeti Gattu Carnage) అంటూ సాయి తేజ్ (Sai Dharam Tej) కూడా సిద్ధమవుతున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తిగా మాస్ కమర్షియల్ సినిమాలు. ఈ కారణంతో కూడా వాళ్లు జిమ్‌లో చెమటోడుస్తున్నారు. వారికి ప్రముఖ ట్రైనర్ రవి ఉడియార్ మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఎవరో చూస్తే.. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలకు ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్‌గా గతంలో ఉన్నారు.
అయితే, ఆయన గతంలో రూ.25 చొప్పున రోజుకు జీతం అందుకునే పనిలో చేరారు. 16 ఏళ్ల వయసులో జిమ్‌లో స్వీపర్‌గా పని చేశారు. అలా అలా ఫిట్‌నెస్ విషయంలో మెలకువలు, పట్టు తెచ్చుకుని తర్వాత రోజులో ట్రైనర్‌గా మారారు. ఆయన పనితనం నచ్చి స్టార్ హీరోలకు ట్రైనర్‌గా మారారు. ‘ధృవ’ (Dhruva) సినిమా సమయంలో రామ్‌చరణ్‌తో (Ram Charan) తొలిసారిగా కలసి పని చేశారు రాకేశ్. అప్పటి నుండి కొనసాగుతున్నారు.