
2011 లో ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) , తాప్సీ (Taapsee Pannu) కాంబినేషన్లో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ (Mr. perfect) అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. అయితే దీని కథ ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవల నుండి లేపేశారంటూ 2017లో ఆ నవల రచయిత అయినటువంటి ముమ్మిడి శ్యామల కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కాపీరైట్ కాలపరిమితి ముగిసిన కారణంగా కేసును కొట్టివేయాలని నిర్మాత దిల్‌రాజ్ (Dil Raju), దర్శకుడు కె.దశరథ్ (Dasaradh)..లు సప్రీంకోర్టును ఆశ్రయించారు.
Dil Raju:
దీనిపై తాజాగా విచారణ జరిగింది. అయితే ఇందులో భాగంగా కోర్టు స్టే విధించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారని దిల్‌రాజు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది, నిర్మాత అయినటువంటి నిరంజన్‌రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దిల్ రాజు, దశరథ్..లకి ఊరట లభించినట్టు అయ్యింది.
కాబట్టి ఇప్పుడు ‘నా మనసు కోరింది నిన్నే’ నవల రచయిత ముమ్మిడి శ్యామలతో చర్చలు జరిపి ఏదో ఒక రకంగా దిల్ రాజు, దశరథ్..లు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు వారి వద్ద 2 వారాల టైం ఉంది అని స్పష్టమవుతుంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా కాపీ ఆరోపణలు, కేసులు వంటి వాటికి కొంత కాలపరిమితి ఉంటుంది.
ఆ టైంలో రచయితలు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అసలు అక్కడి వరకు వెళ్లకుండానే ఛాంబర్లో ఇలాంటి సమస్యలు పరిష్కరించి వాటిని క్లోజ్ చేసేస్తున్నారు. కానీ ఎందుకో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కేసు ఇన్నాళ్లు సాగింది. ఇప్పటికీ ఫైనల్ అయిపోలేదు. కానీ దాదాపు అయిపోయినట్టే అనుకోవాలి..!