
ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ‘చావా’ (Chhaava) గురించి సోషల్ మీడియాలో గట్టిగానే చర్చలు నడుస్తున్నాయి. విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఛత్రపతి శివాజీ వారసుడు అయినటువంటి శంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా ఈ వీకెండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Rohit Pathak
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో కక్కడ్ ఖాన్ అనే పాత్రలో కనిపించిన నటుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇందులో ఇతనికి కూడా మంచి ఎలివేషన్స్ దక్కాయి. ఆ నటుడి పేరు రోహిత్ పాఠక్ (Rohit Pathak). తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతను సుపరిచితమే. 2010 లో నిఖిల్ (Navdeep Pallapolu), నవదీప్ (Navdeep Pallapolu) కాంబినేషన్లో వచ్చిన ‘ఓం శాంతి’ (Om Shanti) తో ఇతను టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కార్తీ (Karthi) – హెచ్.వినోద్ (H. Vinoth) కాంబినేషన్లో వచ్చిన ‘ఖాకీ’ (Khakee) ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత తేజ (Teja) దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ (Sita), నితిన్ (Nithin Kumar) హీరోగా వచ్చిన ‘చెక్’ (Check), గోపీచంద్ (Gopichand) హీరోగా వచ్చిన ‘సీటీమార్’ (Seetimaarr), రామ్ (Ram) హీరోగా వచ్చిన ‘ది వారియర్’ (The Warriorr), చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘వీరసింహారెడ్డి’ ( Veera Simha Reddy) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాలో కూడా బైరాగి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. వరుసగా తెలుగు సినిమాల్లో.. అదీ పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అన్నీ మంచి విజయాలు కూడా సాధిస్తున్నాయి.
రోహిత్ పాఠక్ (Rohit Pathak) గత 4 సినిమాల ట్రాక్ రికార్డు చూసుకుంటే.. అంటే ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ ‘డాకు మహారాజ్’ ‘చావా’ వంటి సినిమాలన్నిటికీ కలుపుకుంటే మొత్తం రూ.1030 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. అయితే తెలుగు సినిమాల్లో ఇతనికి ఛాన్సులు ఎక్కువగా వస్తున్నా…. కానీ తెలుగు సినిమా దర్శకులు ఇతని టాలెంట్ ను సరిగ్గా వాడుకోవడం లేదేమో అనేది కొందరి అభిప్రాయం. మరి మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజసాబ్’ ఏమైనా ఆ లోటుని తెరుస్తుందేమో చూడాలి.