
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతోంది. చిన్న సినిమాల దగ్గరి నుంచి స్టార్ హీరోల భారీ ప్రాజెక్ట్‌ల దాకా ఈ నిర్మాణ సంస్థ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా పుష్ప 2 (Pushpa 2: The Rule) వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో ఇప్పటికే హిట్ టేస్ట్‌ను ఆస్వాదించిన మైత్రి, ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలను లైన్‌లో పెడుతూ టాలీవుడ్‌ను ఏలాలని చూస్తోంది. ఇప్పటికే 2025లో మైత్రి బ్యానర్ నుంచి భారీ స్థాయిలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Mythri Movie Makers
మార్చి 28న నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’(Robinhood) సినిమాను విడుదల చేయనుంది. వెంటనే ఏప్రిల్ 10న గోపీచంద్ మలినేని (Gopichand Malineni) -సన్నీ డియోల్ (Sunny Deol) కాంబోలో తెరకెక్కిన ‘జాట్’ (Jaat), అదే రోజున కోలీవుడ్ స్టార్ అజిత్ (Ajith Kumar) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ను (Good Bad Ugly) కూడా రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) , బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) కాంబోలో రూపొందుతున్న ‘RC 16’ (RC 16 Movie) మైత్రి బ్యానర్‌పై రూపొందుతుండగా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు, మైత్రి బ్యానర్ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇతర ఇండస్ట్రీలలో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.
ప్రభాస్ (Prabhas) , హను రాఘవపూడి (Hanu Raghavapudi) ప్రాజెక్ట్ కూడా మైత్రి లైనప్‌లోనే ఉంది. మైత్రి బ్యానర్‌పై రూపొందుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ప్రస్తుతం ఈ సినిమా హోల్డ్‌లో ఉన్నప్పటికీ, 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ (Jr NTR) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ మూవీ కూడా 2025 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మైత్రి బ్యానర్ నుంచి వచ్చే భారీ ప్రాజెక్ట్‌లలో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’ కూడా ఉంది.
ఈ సినిమా 2026లో థియేటర్లలోకి రానుంది. నాని (Nani) -సీబీ చక్రవర్తి (Cibi Chakaravarthi) కాంబోలో కూడా ఓ మూవీ లైన్‌లో ఉంది, అది 2026 చివర్లో రానున్నట్లు సమాచారం. రామ్ చరణ్-సుకుమార్ (Sukumar), చిరంజీవి (Chiranjeevi)-బాబీ కొల్లి (K. S. Ravindra) ప్రాజెక్ట్‌ల షూటింగ్స్ కూడా 2026లో మొదలవుతాయని టాక్. ఇంత భారీ లైనప్‌తో మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్‌లో తన ప్రభావాన్ని మరింత పెంచేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే, ఈ భారీ సినిమాలన్నీ అంచనాలను అందుకుంటాయా? మైత్రి మరోసారి సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.