సినీ పరిశ్రమని విషాదాలు విడిచి పెట్టడం లేదు. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టు బ్యాడ్ న్యూస్..లు వింటూనే ఉన్నాం. 2025 లో అప్పుడే దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి వంటి వారు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Pushpalatha
ఆ షాక్..ల నుండి ఇండస్ట్రీ కోలుకోకుండానే ఇప్పుడు మరో సీనియర్ నటి కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. సీనియర్ నటి పుష్పలత (Pushpalatha) మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతూ వస్తున్న ఆమె మంగళవారం నాడు రాత్రి చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 87 ఏళ్ళు కావడం గమనార్హం. తమిళంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఈమె.ఎంజిఆర్, శివాజీ గణేషన్, జైశంకర్, జెమినీ గణేషన్ వంటి టాప్ హీరోలతో పుష్పలత కలిసి నటించారు.
అలాగే తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా 100 కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ హీరోగా కోవెలమూడి భాస్కర్ రావ్ దర్శకత్వంలో వచ్చిన ‘చెరపకురా.. చెడేవు’ అనే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. దీంతో పాటు ‘ఆడబిడ్డ’ ‘మా ఊరిలో మహాశివుడు’ ‘వేటగాడు’ ‘ఘరానా దొంగ’ ‘రక్త బంధం’ ‘ఆటగాడు’ ‘మూగవాని పగ’ ‘ఉక్కుమనిషి’ ‘రంగూన్ రౌడీ’ ‘శూలం’ ‘కొండవీటి సింహం’ ‘ఇద్దరు కొడుకులు’ ‘ప్రతిజ్ఞ’ ‘విక్రమ్’ వంటి సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇక పుష్పలత (Pushpalatha) మరణం పట్ల కొందరు సినీ ప్రముఖులు స్పందించి తమ సానుభూతి తెలుపుతున్నారు.