కొన్నేళ్లుగా చూసుకుంటే..హీరోలు ఇష్టం వచ్చినట్టు పారితోషికాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం మనం హిట్లతో ఉన్నామా? ప్లాపుల్లో ఉన్నామా? అనేది చెక్ చేసుకోకుండా.. నాకు హిందీ మార్కెట్ అంత ఉంది, ఓటీటీ మార్కెట్ ఇంత ఉంది అంటూ పారితోషికాలు పెంచేసి.. నిర్మాతల్ని నలిపేస్తున్నారు. ఈ లిస్ట్ చెప్పుకోవాలంటే చాలా ఎక్కువే. కానీ అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) మాత్రం నిర్మాతల సైడ్ నుండి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అతను హీరోగా తెరకెక్కిన ‘తండేల్’ (Thandel) సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.
Naga Chaitanya
ఈ సినిమా నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా. బన్నీ వాస్ (Bunny Vasu) , అల్లు అరవింద్(Allu Aravind)..లు కలిసి దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. దాదాపు ఏడాదిన్నర పాటు షూటింగ్ జరిగింది. నిర్మాత ఇంత బడ్జెట్ పెట్టాడు కాబట్టి.., నేను ఇన్ని రోజులు షూటింగ్ కి వెళ్లాను కాబట్టి… వేరే హీరో అయితే రూ.30 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసేవాడు. కానీ నాగ చైతన్య అలా చేయలేదు.
ఈ సినిమా కోసం అతను కేవలం రూ.10 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకున్నాడట. లాభాల్లో వాటా తీసుకుంటున్నాడా అంటే.. అది ప్రస్తుతానికి చెప్పలేం.ఏదేమైనా ఏడాదిన్నర అంటే నాగ చైతన్య 2,3 సినిమాలు చేసేవాడు. ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు చొప్పున అనుకున్నా ‘తండేల్’ కి అతను ఈజీగా రూ.25 కోట్లు తీసుకుని ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. ఏడాదిన్నర వరకు కష్టపడి ఈ సినిమాకే పనిచేశాడు. రూ.10 కోట్లు మాత్రమే తీసుకున్నాడు.
నిర్మాతకి చాలా వరకు రికవరీ జరిగింది. సినిమా కనుక హిట్ అయితే మరింతగా లాభాలు వస్తాయి. ఇప్పుడు చైతన్య లాభాల్లో వాటా తీసుకున్నా తప్పేమీ లేదు. మిడ్ రేంజ్ హీరోలు నాగ చైతన్యని చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నిర్మాతల ఇబ్బందులు చూసి కూడా.. పారితోషికం పూర్తిగా ఇస్తేనే తప్ప డబ్బింగ్ చెప్పను అంటూ బెదిరించే హీరోలు ఉన్న ఈ రోజుల్లో నాగ చైతన్య ఇలా ఆలోచించడం గ్రేట్ అనే చెప్పాలి.