
కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన ‘అమిగోస్’ (Amigos) తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అషికా రంగనాథ్ (Ashika Ranganath). ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా.. తర్వాత ఈమెకు నాగార్జున (Nagarjuna) ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమాలో ఛాన్స్ వచ్చింది. అది బాగానే ఆడింది. అషికా మరో అనుష్క (Anushka Shetty) అనే రేంజ్లో జనాలు ఆమెపై ప్రశంసలు కురిపించారు. అయినప్పటికీ ఈమెకు అనుకున్న స్థాయిలో ఛాన్స్..లు రావడం లేదు. చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’లో(Vishwambhara) నటిస్తుంది. కానీ అందులో ఆమెది చెప్పుకోదగ్గ పాత్ర కాదు.
Kayadu Lohar
చిరంజీవికి సోదరి టైపు రోల్ అది. ఇక ఇటీవల విశ్వక్ సేన్ (Vishwak Sen) ‘ఫంకీ’ కోసం ఈమెను సంప్రదించారు. ఆమె కూడా ఓకే చెప్పింది. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్టు నుండి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ‘సితార..’ బ్యానర్లో ఆమె మరో సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ ‘ఫంకీ’ నుండి ఆమెను ఎందుకు తప్పించారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పాలి.
విశ్వక్ సేన్- అనుదీప్ (Anudeep Kv) కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ఇది. ‘జాతి రత్నాలు’ తో (Jathi Ratnalu) అనుదీప్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ వచ్చి అతనికి ‘ప్రిన్స్’ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ఆడకపోయినా.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఆ సినిమా నచ్చింది. అనుదీప్ హవా ఏమీ తగ్గలేదు.
ఇక ‘ఫంకీ’ లో విశ్వక్ సరసన కృతి శెట్టి (Krithi Shetty), అషికా రంగనాథ్.. వంటి వారిని ఫిక్స్ చేద్దాం అనుకున్నాడు అనుదీప్. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. దీంతో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) బ్యూటీ కయాడు లోహార్ ని (Kayadu Lohar ) తీసుకున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.