March 20, 202507:18:55 PM

Chhaava: విలన్ పై కోపాన్ని వెండితెరపై చూపించాడు.. ఎంత నష్టమంటే?

Chhaava movie audience angry destroys screen

విక్కీ కౌశల్ (Vicky Kaushal)  , రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ‘చావ’ (Chhaava) బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. శంభాజీ మహారాజ్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తూ, వారిలో అనూహ్యమైన భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాల్లో సినిమా థియేటర్ల వద్ద ఫెస్టివల్ వాతావరణం నెలకొంది. కొంతమంది అభిమానులు శివాజీ వేషధారణలో థియేటర్లకు వస్తే, మరికొందరు గుర్రాలపై కవాతు చేస్తూ సినిమాపై తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

Chhaava

Chhaava movie audience angry destroys screen

అయితే, ఈ సినిమాను చూసిన ఓ వ్యక్తి తన కోపాన్ని అతి తీవ్రంగా వ్యక్తం చేశాడు. గుజరాత్‌లోని భరూచ్ ఆర్‌కె సినిమాస్ మల్టీప్లెక్స్‌లో జయేష్ వాసవ అనే వ్యక్తి, శంభాజీ మహారాజ్ పై ఔరంగజేబు చేసే క్రూరత్వ సన్నివేశాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ సీన్‌ చూస్తూనే మద్యం మత్తులో ఉన్న అతను ఆవేశంతో అగ్నిమాపక యంత్రాన్ని తీసుకుని, నేరుగా స్క్రీన్ పై దాడి చేశాడు. ఒక్కసారిగా స్క్రీన్ చించుకుపోయింది.

Chhaava movie audience angry destroys screen

ఈ ఘటనతో థియేటర్‌లో గందరగోళం నెలకొంది. షోలు రద్దు అయ్యాయి, టిక్కెట్లు రీఫండ్ చేయాల్సి వచ్చింది. మొత్తం మీద రెండు లక్షల రూపాయల ఆర్థిక నష్టం మల్టీప్లెక్స్‌ యాజమాన్యానికి జరిగినట్లు సమాచారం. ఈ దాడి తర్వాత పోలీసులు జయేష్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఒక సినిమా ప్రేక్షకుల మనస్సుల్లో ఎంతటి భావోద్వేగాలను రేకెత్తిస్తాయో మరోసారి రుజువు చేసింది.

సాధారణంగా సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులు చర్చించుకుంటూ బయటకు వెళ్లిపోతారు. కానీ, ‘చావ’ ప్రేక్షకుల్లో ఆవేశం, ఆవేదన కలిగించేలా రూపొందిన సినిమా కావడం విశేషం. మహారాష్ట్రలోని థియేటర్లలో, ప్రతి షో హౌస్‌ఫుల్ అవుతోంది. ప్రేక్షకులు జై శంభాజీ అంటూ సీట్లు వదిలి నిలబడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి, సినిమా కథలోని విలన్‌ పాత్రపై కోపంతో ఓ వ్యక్తి స్క్రీన్‌ను ధ్వంసం చేయడం సినీ చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.