March 21, 202501:40:42 AM

Harish Shankar: ‘పవర్‌’ డిస్కషన్‌: ఆ సీన్‌ రాస్తానన్న ప్రదీప్‌.. ఇప్పటికే షూట్‌ చేసేశామన్న హరీశ్‌!

That Viral video will be in Ustaad Bhagat Singh says Harish Shankar

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పొలిటికల్‌ కెరీర్‌ ఓ మలుపు తిరిగిందన్నా, రాజకీయాల్లో ఆయన మార్క్‌ కనిపించిందన్నా, ఆయన అక్కడ కూడా మాసే అని తెలిసిందన్నా.. ఒకే ఒక్క సీన్‌తో అని చెప్పాలి. ఆయన తడాఖా ఏంటో ఆ రోజు ప్రత్యర్థి పార్టీలకు, ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలకు కూడా తెలిసింది. ఇప్పటికే ఆ సీన్‌ చూస్తే ఫ్యాన్స్‌కి, జనసైనికులకు ఓ ఊపు వస్తుంది. చూడటానికి సినిమాటిక్‌గా కనిపించినా.. అది రియల్‌ సీనే. ఇప్పుడు ఆ రియల్‌ సీన్‌ని రీల్‌లో కూడా చూస్తాం.

Harish Shankar

మీరు జనసేనను, పవన్‌ కల్యాణ్‌ను ఫాలో అయ్యేవాళ్లే అయితే ఆ సీన్‌ ఏంటో ఈజీగా చెప్పేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఓ రోజు పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుండి తన కాన్వాయ్‌లో ఇప్పటం గ్రామానికి బయలుదేరారు. ఆ గ్రామం చేరుకోకముందే మధ్యలో ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కి కూర్చుకున్నారు. కారు దూసుకుపోతున్నా పవన్ కారుపై రిలాక్స్‌డ్‌గా కూర్చున్నారు. ఆ సీన్‌ హీరోయిక్‌గా ఉంటుంది.

ఆ సీన్‌ను గురించి ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆ సినిమా హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) చేసిన కామెంట్స్‌, దానికి హరీశ్‌ శంకర్‌  (Harish Shankar)  ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ తాను పవన్ కల్యాణ్ అభిమానినని, ఆయనతో సినిమా చేస్తే పవన్ కల్యాణ్ ఆ రోజు కారు మీద కూర్చుని వెళ్లిన సీన్‌ను రీక్రియేట్‌ చేస్తా అని చెప్పారు.

That Viral video will be in Ustaad Bhagat Singh says Harish Shankar

వెంటనే హరీష్ రియాక్ట్‌ అవుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాలో ఇప్పటికే ఆ సీన్‌ వాడేశాం అని చెప్పేశారు. గత కొద్ది రోజులుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్ ’ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని హరీష్ ఇలా పరోక్షంగా ఖండించారు అని చెప్పొచ్చు. ఇలాంటి సీన్స్‌ చేసి హై ఇవ్వడం హరీశ్‌కు (Harish Shankar) బాగా అలవాటు. చూద్దాం ఈసారి ఏం చేశారో?

భుజకీర్తులు వద్దు.. పుండ్లు పడతాయి.. బ్రహ్మీ కౌంటర్‌ ఆయన గురించేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.