అందం, ఫిగర్, అవసరమైన గ్లామ్ షో.. ఇలా కియారా అడ్వాణీ దగ్గర అన్నీ ఉన్నాయి. అందుకే బాలీవుడ్‌లో వరుస ఛాన్స్‌లు సంపాదిస్తోంది. తెలుగులో కూడా పెద్ద హీరోలతో ఛాన్స్‌లు అందుకుంటోంది. అయితే వీటితోపాటు ఆమెతో మరో సమస్య కూడా ఉంది అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అదే సినిమా ప్రచారం విషయంలో ఆసక్తి లేకపోవడం. ఇప్పుడు శాండిల్ వుడ్ నుండి కూడా ఓ ఫిర్యాదు బయటకు వచ్చింది. ఫిర్యాదు రావడమే కాదు..
Kiara Advani
ఓ పెద్ద సినిమా నుండి ఆమె తప్పించేశారు అనే మాట కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కియారా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) – ఎన్టీఆర్ (Jr NTR) ‘వార్ 2’ కాగా.. కన్నడలో యశ్ ‘టాక్సిక్’(Toxic). ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే. అయితే ‘టాక్సిక్’ సినిమా నుండి ఆమెను తప్పించారు అనే చర్చ జోరుగా మొదలైంది. ఇటీవల ‘టాక్సిక్’ ఒక షెడ్యూల్ జరిగిందట. ఆ రషెష్ చూసుకున్న దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas), హీరో యశ్ (Yash).. కియారాతో(Kiara Advani) కష్టమే అని భావించారట.
ఆమెను తప్పించి వేరే హీరోయిన్‌ను తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారట. సినిమాకు తగ్గట్టుగా ఆమె నటన లేదు అనేది వారి ఆలోచనట. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇక ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)సినిమా ప్రచారం విషయంలో కియారా చేసిన పని కూడా సరిగా లేదు. సినిమా ప్రచారంలో ఆమె (Kiara Advani) ఎక్కడా పాల్గొనలేదు. కేవలం హిందీ ‘బిగ్ బాస్’ షోకి మాత్రమే రామ్‌చరణ్‌తో (Ram Charan) హాజరైంది.
తెలుగులో ఒక్క ప్రెస్ మీట్‌కి కానీ, ఈవెంట్ కానీ, ఇంటర్వ్యూకి కానీ రాలేదు. దీంతో హీరోయిన్ ఇలా ఉంటే ఎలా అనే చర్చ మొదలైంది. అయితే ఆమె అనారోగ్యం వల్ల రాలేదు అని చెబుతున్నా.. అది ఎంతవరకు సమంజసం అనేది చెప్పలేం. దీంతో కియారా క్యాహోరా అనే ప్రశ్న మొదలైంది. మరి ఆమె ఏమైనా క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.