March 26, 202507:29:21 AM

Kingdom: విజయ్ దేవరకొండ టీజర్ చరణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిందా?

Ram Charan fans got hurted with Kingdom teaser

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొన్నాళ్లుగా సరైన హిట్టు కోసం పరితపిస్తున్నాడు. ‘టాక్సీ వాలా’ (Taxiwaala) తర్వాత అతని ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘ఖుషి’ (Kushi) జస్ట్ యావరేజ్ అనిపించింది. ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade)  కూడా అంతే..! ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. సో ఇప్పుడు అతనికి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) ,’సితార ఎంటర్టైన్మెంట్స్’ నాగ వంశీ (Suryadevara Naga Vamsi)..ల పై పడింది.

Kingdom

Ram Charan fans got hurted with Kingdom teaser

వీరి కాంబినేషన్లో ‘#VD12’ రూపొందుతుంది. ఇటీవల దానికి ‘కింగ్డమ్’ (Kingdom) అనే టైటిల్ ని పెట్టి టీజర్ ని కూడా వదిలారు. ఈ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండని ఇలాంటి లుక్లో మునుపెన్నడూ చూడలేదు. చూడటానికి స్టౌట్ గా ఉన్నాడు. పాన్ ఇండియా హీరోలా కనిపిస్తున్నాడు. అందువల్ల తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాతో విజయ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని అంతా భావిస్తున్నారు.

Ram Charan fans got hurted with Kingdom teaser

ఎన్టీఆర్ (Jr NTR) వాయిస్ ఓవర్ కూడా ఈ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. వాస్తవానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరిలో (Gowtam Naidu Tinnanuri) ఇంత మాస్ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. అతని ఫస్ట్ మూవీ ‘మళ్ళీ రావా’ (Malli Raava) కానీ ‘జెర్సీ’ (Jersey) కానీ ఆఫ్ బీట్ కంటెంట్ తో ఉంటాయి. ఎమోషనల్ గా కనెక్ట్ అయితే తప్ప అవి అందరికీ నచ్చవు. కానీ ‘కింగ్డమ్’ టీజర్లో అన్ని వర్గాల ప్రేక్షకులను.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని అలరించే అంశాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ముందుగా ఈ కథని గౌతమ్.. రామ్ చరణ్ కి వినిపించాడు.

Vijay Deverakonda's Kingdom Movie Teaser

అతనికి కథ బాగా నచ్చింది. ‘యూవీ క్రియేషన్స్’ లో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు చరణ్ (Ram Charan). కానీ ‘జెర్సీ’ హిందీలో ఫ్లాప్ అవ్వడం వల్ల చరణ్ వెనక్కి తగ్గాడు. అప్పుడు ‘గౌతమ్ ను పక్కన పెట్టి చరణ్ మంచి పని చేశాడు’ అని పలికిన వాళ్ళు ఇప్పుడు టీజర్ చూసి చరణ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటున్నారు. ఈ కథకి సరిపడా బాడీ రాంచరణ్ కి ఉంది. అందుకే అంతా ఇలా కామెంట్స్ చేస్తున్నారు. కానీ సినిమా చూడకుండా.. అప్పుడే చరణ్ డెసిషన్ ని తప్పు పట్టడం అనేది తొందరపాటు అవుతుంది అని చెప్పాలి.

మార్చి నెల అంటే నిర్మాతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నట్టు..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.