March 23, 202506:11:43 AM

Klin Kaara: క్లీంకార ఫేస్ రివీల్… ఎంత క్యూట్ గా ఉందో… వీడియో వైరల్!

Ram Charan Daughter Face Reveled Video Goes Viral

మెగా పవర్ స్టార్ రాంచరణ్, అతని సతీమణి ఉపాసన కొన్నాళ్లుగా తమ కుమార్తె క్లీంకార ఫేస్ రివీల్ కాకుండా చూసుకుంటున్నారు. దిష్టి తగులుతుందనో… లేక జాతకం రీత్యా అలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కాలేదు. పాపని తీసుకుని ఎక్కడికి వెళ్లినా ఫేస్ కనిపించకుండా ఇప్పటి వరకు జాగ్రత్త పడుతూ వచ్చారు. సాధారణంగా స్టార్లు ఎక్కడికి వెళ్లినా కెమెరాలు అన్నీ వీళ్ళ వైపే తిరుగుతాయి.

Klin Kaara

మొన్నటికి మొన్న ఈ మెగా దంపతులు తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా పాప ఫేస్ పూర్తిగా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా వీళ్ళు ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఈసారి మాత్రం పాప ఫేస్ రివీల్ అయిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇందులో రామ్ చరణ్ తన కూతురు క్లీంకారని ఎత్తుకొని ఉన్నాడు.

Ram Charan Daughter Face Reveled Video Goes Viral

అతను ఒక చేత్తో పాపని ఎత్తుకోవడం.. అదే చేతిలో పాస్ పోర్ట్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. చెకింగ్ వద్ద ఈ తండ్రీకూతుళ్లు దర్శనమిచ్చారు.క్లీంకార చుట్టూ ఉన్న పరిసరాలను చాలా అమాయకంగా చూస్తూ.. చాలా క్యూట్ గా కనిపించింది. తన ఫ్యామిలీతో కలిసి చరణ్ చిన్న ట్రిప్ కి వెళ్తున్నట్టు స్పష్టమవుతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్నాడు. ఇందులో అతను క్రికెటర్ గా కనిపించబోతున్నట్టు టాక్.

అల్లు అర్జున్ సతీమణి బాధతోనే ఇలా చెప్పిందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.