April 1, 202502:26:37 AM

Laila Collections: ఊహించిన దానికంటే కూడా చాలా తక్కువ!

Laila Movie 1st Day Total Worldwide Collections

విశ్వక్ సేన్  (Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ (Laila). రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి (Sahu Garapati) నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న అంటే నిన్న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయ్యింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం.. అతని స్టైల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాను ప్రమోట్ చేయడం, చిరంజీవి (Chiranjeevi) వంటి స్టార్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సినిమాను ప్రమోట్ చేయడం..

Laila Collections:

Laila Movie Review and Rating

వీటన్నిటికీ మించి 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) కాంట్రోవర్సీ వంటివి సినిమాకి పబ్లిసిటీకి హెల్ప్ అయ్యాయి. కానీ మొదటి రోజు మొదటి షోతోనే ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. అందువల్ల ఓపెనింగ్స్ నిరాశపరిచాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.21 cr
సీడెడ్ 0.07 cr
ఆంధ్ర(టోటల్) 0.24 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.18 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.70 cr

‘లైలా’ (Laila) చిత్రానికి రూ.7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ‘లైలా’ మొదటి రోజు కేవలం రూ.0.70 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.30 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

28 ఏళ్ళ ‘శుభాకాంక్షలు’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.