March 19, 202501:12:24 PM

Manchu Vishnu: ఆ ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా భారీగానే తీసుకున్నారు: మంచు విష్ణు!

Manchu Vishnu opens up about Kannappa cast remunerations

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో (Kannappa) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas)  నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేసినా, అతని పాత్ర మాత్రం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట. రామోజీ ఫిల్మ్ సిటీలో కేవలం ఐదు రోజుల్లోనే ప్రభాస్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసేశారు.

Manchu Vishnu

Manchu Vishnu clarity on Why religion mark on cinema

ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ముఖ్యమైన పాత్రల్లో, గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రభాస్ ‘కన్నప్ప’ సినిమాలో నటించినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే చెప్పారు. ప్రభాస్‌కి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ‘కన్నప్ప’ కోసం టైమ్ కేటాయించి, పైసా తీసుకోకుండా నటించాడని విష్ణు తెలిపారు. తన తండ్రి మోహన్ బాబు (Mohan Babu)  మీద ప్రేమతో ఈ పాత్ర ఉచితంగా చేశాడని విష్ణు ఎంతో కృతజ్ఞతతో చెప్పారు.

Manchu Vishnu opens up about Kannappa cast remunerations

అలాగే మోహన్ లాల్ కూడా పారితోషికం తీసుకోలేదని విష్ణు ఈ సందర్భంగా తెలియజేశారు. మిగిలిన వాళ్ళు గట్టిగానే తీసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. ‘కన్నప్ప’ సినిమాలో మోహన్ బాబు, ఆర్. శరత్‌కుమార్, అర్పిత రాంకా, కౌశల్ మండ, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం (Brahmanandam)  , రఘుబాబు (Raghu Babu) వంటి నటీనటులు నటిస్తున్నారు.

Manchu Vishnu clarity on Why religion mark on cinema

అలాగే అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)  శివ పార్వతులుగా కనిపిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు, మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్  (Mohanlal) , అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ వల్ల ‘కన్నప్ప’ కి మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

అర్జున్ చేసిన పాత కామెంట్స్ తో మరీ విశ్వక్ సేన్ ని టార్గెట్ చేస్తున్నారు..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.