March 23, 202505:36:52 AM

Nani: నాని పాన్ ఇండియా ప్లాన్స్.. రంగంలోకి నేషనల్ క్రష్?

నేచుర‌ల్ స్టార్ నాని (Nani)  ప్ర‌ధాన పాత్ర‌లో శ్రీకాంత్ ఓదెల  (Srikanth Odela)  ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ది ప్యార‌డైజ్ సినిమా బాగా క్రేజ్ సంపాదిస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేర్లు గట్టిగా వినిపించినప్పటికీ, ఎవ‌రికీ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. శ్ర‌ద్ధా కపూర్ భారీ పారితోషికం డిమాండ్ చేయ‌డంతో మేక‌ర్స్ వెన‌క్కి తగ్గారు. అలాగే, హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలో నాని సరసన మృణాల్ నటించినందున, మళ్లీ అదే కాంబినేషన్ ఆడియెన్స్‌కు ఫ్రెష్‌గా అనిపించదనే ఉద్దేశంతో ఆమెను పక్కన పెట్టారు.

Nani

Nani pan india plans with Rashmika

ఈ నేపథ్యంలో తాజాగా నేషనల్ క్రష్ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna)  పేరు బలంగా వినిపిస్తోంది. ర‌ష్మిక గ్లామర్, పెర్ఫార్మెన్స్ కాంబినేషన్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని, ఆమె డేట్స్ కోసం నాని స్వయంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కథలోని హీరోయిన్ క్యారెక్టర్ కోసం ర‌ష్మిక అయితే బాగా సెట్ అవుతుందనే అభిప్రాయంలో దర్శకుడు శ్రీకాంత్ ఉన్నాడట. అయితే, ర‌ష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది.

Nani pan india plans with Rashmika

బాలీవుడ్‌లో చావా (Chhaava), అనిమల్ (Animal) సినిమాల విజ‌యాల త‌ర్వాత ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ పెరిగింది. అందుకే ఆమె పారితోషికం కూడా భారీగా పెరిగింది. పుష్ప 2 (Pushpa 2: The Rule), కుబేర (Kubera) సినిమాల‌తో ప్యాక్ అయిన ఆమె, మరో తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నదే ప్ర‌శ్న. నాని వ్యక్తిగతంగా రష్మికను కన్‌విన్స్ చేయడానికి ముందుకొచ్చాడట. నిర్మాతలుకూడా ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Sekhar Kammula planning for another pan-india project2

ఎందుకంటే, ర‌ష్మిక ఇమేజ్ సినిమాకి మ‌రింత క్రేజ్ తీసుకువచ్చే చాన్స్ ఉంది. ఆమె ప్యాన్ ఇండియా పాపులారిటీని బాగా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఎలాంటి సాకులు చెప్పకుండా ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి ది ప్యార‌డైజ్ సినిమాకి హీరోయిన్ ఎంపిక ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ర‌ష్మిక డేట్ ఇచ్చిన‌ట్లయితే నాని-ర‌ష్మిక కాంబినేషన్ ఆకట్టుకునే అవకాశం ఉంది. లేదంటే మేకర్స్ మ‌రో కొత్త హీరోయిన్ వైపుకు వెళ్లే ఛాన్స్ ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.