కోలీవుడ్ స్టార్ హీరో అజిత్జం (Ajith Kumar) , త్రిష (Trisha) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పట్టుదల'(Pattudala). ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మగిల్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ ( Arjun Sarja), రెజీనా (Regina Cassandra)..లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అయితే రెండో రోజు ‘తండేల్’ (Thandel) సినిమా రిలీజ్ అయినప్పటికీ మొదటి రోజుతో కొంచెం ఈక్వల్ గా పెర్ఫార్మ్ చేసి ఓకే అనిపించింది.
Pattudala Collections:
3వ రోజు కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి.అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగానే ఉంది. తమిళంలో అయితే బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. తెలుగులో కొంచెం ప్రమోట్ చేసి ఉండుంటే.. సినిమాకి బెటర్ ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.35 cr |
సీడెడ్ | 0.17 cr |
ఉత్తరాంధ్ర | 0.27 cr |
ఈస్ట్ | 0.79 cr |
‘పట్టుదల'(తెలుగు) కి రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.0.79 కోట్ల షేర్ ను రాబట్టింది. 3వ రోజు కూడా పర్వాలేదు అనిపించినా.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.71 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి డీసెంట్ గా అయితే పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ టార్గెట్ అయితే చాలా ఉంది.