కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) సినిమాలకి తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్నాళ్లుగా అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూ వస్తోంది. కానీ ప్రమోషన్ లేకుండా రిలీజ్ అవుతుండటం వల్ల.. అవి అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోతున్నాయి. ఇదిలా ఉండగా.. అజిత్ లేటెస్ట్ మూవీ ‘పట్టుదల’ (Pattudala) ఈ గురువారం నాడు అంటే ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. మగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకుడు.
Pattudala First Review:
ఈ టీజర్, ట్రైలర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తం వెస్ట్రన్ స్టైల్లో ఉండటం వల్ల.. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాకి రావాల్సినంత బజ్ ఏర్పడలేదు. అయినప్పటికీ తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ఈ చిత్రాన్ని తమిళంలో కొంతమంది సినీ పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూశాక ట్విట్టర్ ద్వారా వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ‘పట్టుదల'(‘విధాముయార్చి’) … ‘బ్రేక్ డౌన్’ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా రూపొందింది అని వాళ్ళు మరోసారి గుర్తు చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట.. కొన్నాళ్ల పాటు హ్యాపీగానే కలిసుండటం.. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడం.. సెపరేట్ అయిపోవాలి అని భార్య నిర్ణయించుకోవడం, అదే టైంకి ఆమె కిడ్నాప్ అవ్వడం జరుగుతుందట. ఆ తర్వాత ఆ భర్త తన భార్యని ఎలా రక్షించుకున్నాడు? అసలు ఆమెను కిడ్నాప్ చేసిన ముఠా ఎవరు? అనేది మిగిలిన సినిమా అని తెలుస్తుంది.
‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ వారి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయట. అనిరుధ్ (Anirudh Ravichander) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉంటుందట. యాక్షన్ బ్లాక్స్ వంటివి బాగున్నాయట. మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.