![Samantha reaction on Naga Chaitanya-Sobhita Marriage](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Samantha-reaction-on-Naga-Chaitanya-Sobhita-Dhulipala-Marriage.jpg)
నాగ చైతన్య (Naga Chaitanya) – సమంత (Samantha) 2017 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 4 ఏళ్ళ పాటు వాళ్లు హ్యాపీగా కలిసున్నారు. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా విడిపోయారు. ఇది వాళ్ళ అభిమానులకి పెద్ద షాకిచ్చింది. ఈ విషయంపై వీరిద్దరూ స్పందించడానికి ఇష్టపడలేదు. నాగ చైతన్య అయితే తమ కెరీర్ బాగుండాలనే ఉద్దేశంతో విడిపోయాం అని ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ లో తెలిపాడు. సమంత అయితే రకరకాల సమాధానాలు ఇస్తూ వచ్చింది. మొత్తానికి వీటన్నిటి నుండి మూవ్ ఆన్ అయిపోయి నాగ చైతన్య.. శోభితని (Sobhita Dhulipala) రెండో పెళ్లి చేసుకున్నాడు.
Samantha
ప్రస్తుతం అతను ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగానే గడుపుతున్నాడు. కానీ సమంత మాత్రం సింగిల్ గానే ఉంది. ఆమె కూడా దర్శకుడు రాజ్ తో ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంతకి నాగ చైతన్య రెండో పెళ్లి గురించి అసూయగా ఉందా? అంటూ ఓ ప్రశ్న ఎదురైంది.
అందుకు సమంత స్పందిస్తూ.. “అలాంటిది ఏమీ లేదు. నా జీవితంలో అసూయకి చోటే లేదు. చెడుకు మూలమే అసూయ అని నేను భావిస్తుంటాను. నా జీవితంలో దానికి చోటే లేదు. ఇలాంటి వాటి గురించి కూడా నేను ఆలోచించను” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ ను బట్టి చూస్తే.. నాగ చైతన్య రెండో పెళ్లి విషయాన్ని ఆమె అసలు పట్టించుకోలేదు అని స్పష్టమవుతుంది.
లేదు అంటే మీడియా ముందు బయటపడటానికి అయినా ఆమె ఇష్టపడట్లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఇక సమంత లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వింత గెటప్లో.. అందులో సమంత కనిపించింది. ఇక కొన్నాళ్లుగా ఆమె సినిమాలకి కూడా దూరంగా ఉంది.