March 20, 202505:40:15 PM

Prabhas: ఏఐ తో ‘స్పిరిట్’ తీస్తున్నారు.. చూశారా?

AI video of Prabhas and Don Lee goes viral2

‘సలార్'(మొదటి భాగం) (Salaar)  , ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమాల విజయాలతో ప్రభాస్ (Prabhas) మంచి ఫామ్లోకి వచ్చాడు. ప్రస్తుతం అతను మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’  (The Raja saab)  చేస్తున్నాడు. వాస్తవానికి దీనికి పెద్దగా బజ్ లేదు. కానీ హిట్ టాక్ కనుక వస్తే.. బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. మరోపక్క హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ కూడా చేస్తున్నాడు. అయితే అభిమానుల దృష్టంతా ‘స్పిరిట్’ (Spirit) పై ఉంది. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘యానిమల్’ (Animal)సినిమాలతో భారీ విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)..

Prabhas

AI video of Prabhas and Don Lee goes viral2

ప్రభాస్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడా? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అని సందీప్ రివీల్ చేయడం జరిగింది. అలాగే హాలీవుడ్ నటుడు డాన్లీ కూడా ఇందులో నటిస్తున్నాడు అనే చర్చ కూడా నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అయితే కొంతమంది ఫ్యాన్స్ ఆత్రం ఆపుకోలేక ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ‘స్పిరిట్’ షూటింగ్ ఎలా ఉంటుందో..

అందులో సీన్లు ఎలా ఉంటాయో.. షూటింగ్ తర్వాత ప్రభాస్ ఎలా ఉంటాడో? అనేది చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. షూటింగ్ టైంలో ప్రభాస్ .. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా..ల మధ్య చర్చ.. సినిమాలో యాక్షన్ సీన్.. అందులో పోలీస్ డ్రెస్ లో ప్రభాస్ కనిపించడం, షూటింగ్ అయిపోయాక నటుడు డాన్లీ ని తన అతిధి మర్యాదలతో ప్రభాస్ టార్చర్ పెట్టడం..

చివరికి అతను దండం పెట్టేయడాన్ని ఇందులో ఫన్నీ వేలో చూపించారు. దీంతో మరి కొంతమంది అభిమానులు ‘ప్రభాస్, సందీప్.. త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయండి, లేకపోతే మీ ఫ్యాన్స్ ఏఐతో సినిమా తీసేసి నెట్లో వదిలేసేలా ఉన్నారు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.