డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh).. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) తో బ్లాక్ బస్టర్ కొట్టాక, ‘లైగర్’ (Liger) అనే భారీ డిజాస్టర్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) చేసిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి పెద్ద ప్లాప్ అయ్యింది. హిందీలో పర్వాలేదు అనిపించినా.. తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్స్ భారీగా నష్టపోయారు. వారి నష్టాలు తీర్చడానికి రామ్ తో (Ram) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చేశాడు పూరీ. ఇది కథగా బాగానే ఉన్నా.. కథనం వీక్ గా ఉండటం, ప్రాపర్ ప్రమోషన్ చేయకుండా సినిమాని రిలీజ్ చేయడంతో..
Puri Jagannadh
దీనికి కూడా నష్టాలు వచ్చాయి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ వల్ల దీనికి బిజినెస్ బాగా జరిగింది. అందువల్ల ‘లైగర్’ నిర్మాతలకి సెటిల్మెంట్ చేసేశాడు పూరీ. ‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. పూరీతో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఇద్దరు, ముగ్గురు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ తొందరపడకుండా మంచిగా స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని తర్వాత..
ప్రాజెక్టు అనౌన్స్ చేయాలని పూరీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పూరీ ముంబైలోనే ఉంటున్నాడట. బాలీవుడ్ నిర్మాతలతో కూడా మీటింగులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ వల్ల నష్టపోయిన నిరంజన్ రెడ్డికి కూడా ఒక సినిమా చేసి పెట్టాలని పూరీ భావించాడట. కాకపోతే నిరంజన్ రెడ్డి ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ తో ‘సంబరాల యేటి గట్టు’ అనే సినిమా చేస్తున్నాడు.
దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నట్టు వినికిడి. అందుకే ఇది పూర్తయ్యాక నెక్స్ట్ సినిమా సంగతి చూద్దామని నిరంజన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పూరీ కూడా కొన్నాళ్ల పాటు స్క్రిప్ట్ పైనే కూర్చోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం.