March 25, 202511:21:26 AM

Ranbir Kapoor: రణబీర్ బిగ్ స్టెప్.. తెలుగులోనూ ప్యాన్‌ ఇండియా దూకుడు!

Ranbir Kapoor to make a direct Telugu Movie

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)  ఇప్పుడు టాలీవుడ్ వైపు దృష్టి పెట్టినట్టుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన నటించిన యానిమల్ (Animal) సినిమా తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో కూడా రణబీర్‌కి క్రేజ్ పెరిగింది. ఇప్పటికే తెలుగులో ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో, ఇప్పుడు ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని రణబీర్ ఆలోచనలో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం రణబీర్ టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం.

Ranbir Kapoor

సితార బ్యానర్ ఇప్పటికే దుల్కర్  (Dulquer Salmaan), సల్మాన్ (Salman Khan) , ధనుష్ (Dhanush) వంటి పరభాషా హీరోలతో భారీ విజయాలు అందుకుంది. ఇప్పుడు రణబీర్‌ను టాలీవుడ్‌లో లాంచ్ చేసే మిషన్‌లో ఉన్నట్టుగా ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. యానిమల్ తో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన రణబీర్, తెలుగులో కూడా తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో అతనికి పాన్ ఇండియా స్టార్ గా రేంజ్ పెరిగింది.

Naga Vamsi planning next with Ranbir Kapoor

అంతేకాదు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి (S. S. Rajamouli), సుకుమార్ (Sukumar), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాల ప్రభావంతో బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగులో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక టాప్ తెలుగు దర్శకుడిని లైన్‌లో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయం గోప్యంగా ఉంచారు. కానీ, ఇది ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు రణబీర్ కపూర్ దగ్గర రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రామ్-మాధవన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న రామాయణ: పార్ట్ 1 షూటింగ్ ప్రారంభమైంది. అలాగే, మరో క్రేజీ ప్రాజెక్ట్ లవ్ అండ్ వార్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు 2026లో రిలీజ్ కానున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత రణబీర్ టాలీవుడ్ ఎంట్రీపై పూర్తిగా ఫోకస్ పెట్టబోతున్నాడని సమాచారం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.