March 16, 202511:51:49 AM

Thandel Collections: రెండో వీకెండ్ మరింత ప్రాఫిట్స్ తెచ్చుకునే ఛాన్స్!

Thandel Movie 1st week Total Worldwide Collections

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ (Thandel)  సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు కావస్తోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దర్శకుడు చందూ మొండేటి నాగ చైతన్యని ప్రజెంట్ చేసిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది.దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన సాంగ్స్ కూడా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చాయి.

Thandel Collections:

Thandel Movie key points

ఒక్క ఓవర్సీస్ లో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 14.85 cr
సీడెడ్ 4.57 cr
ఉత్తరాంధ్ర 4.82 cr
ఈస్ట్ 2.37 cr
వెస్ట్ 1.76 cr
కృష్ణా 1.89 cr
గుంటూరు 1.83 cr
నెల్లూరు 1.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 33.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.66 cr
ఓవర్సీస్ 4.18 Cr
టోటల్ వరల్డ్ వైడ్ 40.96 cr (షేర్)

‘తండేల్’ చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.40.96 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.4.96 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. గ్రాస్ పరంగా రూ.71 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.

అకిరా పవర్ఫుల్ టీజర్.. మామూలుగా లేదు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.