
ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) అందరికీ సుపరిచితమే. ఇప్పటివరకు 18 సినిమాల్లో నటించింది.అయితే ఈ 18 లో ఎక్కువగా స్పెషల్ సాంగ్సే ఉన్నాయి. నటిగా చేసింది 4,5 కి మించి ఉండవు. హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ భాషల సినిమాల్లో కూడా ఈమె పాపులర్. అయితే అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్ తోనే. అంటే స్పెషల్ సాంగ్స్ తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుందన్న మాట. తెలుగులో ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) ‘ఏజెంట్’ (Agent) ‘బ్రో’ (BRO) వంటి స్పెషల్ సాంగ్స్ చేసింది.
Urvashi Rautela
వాస్తవానికి ఈమె స్పెషల్ సాంగ్స్ చేసినా నిర్మాతలు గట్టిగానే ఇస్తున్నారు. ఒక్కో పాటకు ఈమె రూ.70 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఛార్జ్ చేస్తుంది అని వినికిడి. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడికి వరుసగా స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేయడం నచ్చడం లేదట. నటిగా కూడా ప్రూవ్ చేసుకోవాలని ఈమె భావిస్తుంది. ఇటీవల వచ్చిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) లో ‘దబిడి దిబిడి’ అనే పాటలో ఈమె కనిపించింది.
రిలీజ్ కి ముందు కేవలం ఆ ఒక్క పాటలో మాత్రమే ఈమె కనిపిస్తుందేమో అని రిలీజ్ కి ముందు అంతా అనుకున్నారు. కానీ తర్వాత సినిమాలో ఈమె యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా పాల్గొంది. ‘డాకు..’ లో ఊర్వశి పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఇక నుండి నటిగా కూడా రాణించాలని ఆమె ఫిక్స్ అయ్యింది.
ప్రస్తుతం ఆమె ప్రశాంత్ నీల్ (Prashanth Neel) – ఎన్టీఆర్ (Jr NTR).. కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తుంది. ఇందులో కూడా ఆమె స్పెషల్ సాంగ్ కి మాత్రమే పరిమితం కాకుండా.. ముఖ్యమైన పాత్రలో కూడా కనిపించబోతుందట. మరి బాబాయ్ సినిమాలనే అబ్బాయ్ సినిమా కూడా ఊర్వశికి కలిసొస్తుందేమో చూడాలి.