
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న విశ్వంభర Vishwambhara) సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బింబిసార తో తన టాలెంట్ చూపించిన దర్శకుడు వశిష్ట (Mallidi Vasishta).. ఈ సారి మెగాస్టార్ తో సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ లో ఓ విజువల్ వండర్ ను అందించేందుకు సిద్ధమయ్యాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారుకాలేదు. ఇప్పటికే టీజర్ తో విశ్వంభర పై భారీ హైప్ క్రియేట్ కాగా, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ గురించి ఫిల్మ్ నగర్ లో చర్చ మొదలైంది.
Vishwambhara
కీరవాణి (M. M. Keeravani) ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడని టాక్. ముఖ్యంగా “రాముల వారిపై రామ రామ” అంటూ సాగే ఒక మాస్ బీట్ సాంగ్ ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో చిరంజీవి తో పాటు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా స్టెప్పులు వేయనున్నాడట. సాంగ్ షూటింగ్ ఇటీవల హైద్రాబాద్ లోని గ్రాండ్ సెట్స్ లో పూర్తి చేశారు. ఈ పాటలో చిరంజీవి తన సిగ్నేచర్ గ్రేస్ తో అదరగొట్టాడని యూనిట్ టాక్.
మరోవైపు సాయిధరమ్ తేజ్ ఎంట్రీ కూడా మెగా ఫ్యాన్స్ కి పూనకం తెప్పించేలా ఉంటుందని అంటున్నారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట వినగానే అభిమానులు థియేటర్ లో హంగామా చేయడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సాంగ్ ను ఉగాది సందర్భంగా మార్చి చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం. ఫస్ట్ సింగిల్ తోనే విశ్వంభర ప్రమోషన్స్ కు బిగ్ బజ్ వస్తుందని యూనిట్ భావిస్తోందట.
సినిమా మొత్తం విజువల్ గ్రాండియర్ తో పాటు కీరవాణి సంగీతం, మెగాస్టార్ గ్లామర్ తో ఊహించని ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుందని చెప్పుకుంటున్నారు. ఈ సాంగ్ హిట్ అయితే, సినిమా హైప్ మరో స్థాయికి వెళ్తుందని సినీ వర్గాల చెబుతున్నాయి. విశ్వంభర నుంచి మిగిలిన సాంగ్స్ కూడా సూపర్ గా వచ్చాయట. మరి మెగా ఫ్యాన్స్ కోసం ఈ ఉగాదికి వస్తున్న ఫస్ట్ సర్‌ప్రైజ్ ఎలా ఉంటుందో చూడాలి.