
నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం ‘ఏమాయ చేసావే’ (Ye Maaya Chesave). ‘ఇందిరా ప్రొడక్షన్స్’ సంస్థ పై మహేష్ సోదరి ఘట్టమనేని మంజుల (Manjula Ghattamaneni) ఈ చిత్రాన్ని నిర్మించారు. సమంత (Samantha) ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా 2010 ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత యూత్ ఎగబడి చూశారు.
Ye Maaya Chesave Collections
దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా క్లీన్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఈ సినిమా ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.50 cr |
సీడెడ్ | 1.73 cr |
ఉత్తరాంధ్ర | 1.28 cr |
ఈస్ట్ | 0.54 cr |
వెస్ట్ | 0.58 cr |
గుంటూరు | 1.23 cr |
కృష్ణా | 0.66 cr |
నెల్లూరు | 0.47 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.99 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.80 cr |
ఓవర్సీస్ | 1.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 11.79 cr |
‘ఏమాయ చేసావె’ చిత్రం రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో రూ.11.79 కోట్ల షేర్ ను రాబట్టి.. క్లీన్ హిట్ గా నిలిచింది.బయ్యర్లకి రూ.2.79 కోట్ల లాభాలు అందించింది. నాగచైతన్య డెబ్యూ మూవీ అంతగా ఆడలేదు. అతని కెరీర్లో మొదటి హిట్ ఇదే అని చెప్పాలి.