March 16, 202509:33:18 AM

Anasuya: హోలీ ఈవెంట్ లో అనసూయ హల్ చల్.. కారణం ఏంటంటే!

Anasuya Angry on crowd for calling her aunty

అనసూయ (Anasuya) చాలా ఏళ్లుగా చెబుతూనే ఉంది తనను ఎవరైనా అంటీ అని పిలిచే చిర్రెత్తుకొస్తుందని. అయినా సోషల్ మీడియా యువత ఆమెను ఆంటీ అంటూ ఆటపట్టిస్తుంటారు. అందుకు అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా పంచ్ లు వేస్తూ ఉంటుంది. అయితే.. నిన్న (మార్చి 14) హైదరాబాద్ లోని ఒక హోలీ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన అనసూయను అక్కడ క్రౌడ్ లో ఒకడు “ఆంటీ” అని పిలిచాడు. అంటే.. అనసూయకి ఎక్కడలేని కోపం వచ్చింది. దమ్ముంటే స్టేజ్ పైకి రారా అంటూ సవాలు విసిరింది.

Anasuya

ఏం పైకి రావాలంటే ఉచ్చ పడుతుందా అని సైగ కూడా చేసింది. చుట్టూ బౌన్సర్లను చూసి ఖంగుతిన్న ఆ కుర్రాడు సైలెంట్ అయిపోయి ఉంటాడు. అయితే.. సెలబ్రిటీలు ఈ తరహా పబ్లిక్ ఈవెంట్ లకు వెళ్లడం, అక్కడ చిన్నపాటి ఇబ్బందికరమైన రచ్చలు జరగడం అనేది సర్వసాధారణం. మరీ ఫిజికల్ గా ఎవరైనా టచ్ చేయడానికి ప్రయత్నిస్తే తప్ప సెలబ్రిటీలు సీరియస్ అయిన దాఖలాలు లేవు. కానీ.. అనసూయ ఇలా పబ్లిక్ ఈవెంట్లో ఆంటీ అని పిలిచాడని ఓ కుర్రాడ్ని పట్టుకొని “దమ్ముంటే స్టేజ్ పైకి రారా” అనడడం అనేది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఆంటీ అనే పదంలో బూతు ఉందా, ఆమె (Anasuya) ఎందుకు అంతలా ఇబ్బందిపడుతుంది అనే విషయం కాసేపు పక్కన పెడితే, ఒక పబ్లిక్ ఈవెంట్లో, అది కూడా నానా యాగీ జరిగే హోలీ ఈవెంట్లో తనను “ఆంటీ” అన్నాడని సీరియస్ అవ్వడంలో లాజిక్ లేదు. అలాగని ఎన్ని అన్నా సైలెంట్ గా ఉండాలని కాదు కానీ.. ఈ తరహా పబ్లిక్ ఈవెంట్లో ఇలా అనడం అనేది సర్వసాధారణం. ఇకపోతే అనసూయ త్వరలో “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu)  సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.