March 25, 202510:58:18 AM

విశ్వక్.. కెరీర్ సెట్టయ్యేలా మరింత జాగ్రత్తగా..!

Vishwak Sen career bounce back plans

విశ్వక్ సేన్ (Vishwak Sen)  టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా, ఇటీవల వరుసగా వచ్చిన ఫలితాలు అతనిని ఆలోచనలో పడేశాయి. ఎప్పుడూ డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ప్రయోగాలకు సిద్ధంగా ఉండే ఈ యంగ్ హీరో, లేటెస్ట్‌గా హిట్ ట్రాక్‌లోకి రావడానికి కొత్తగా ప్లాన్ చేస్తున్నాడు. లైలా (Laila) ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోగా, మెకానిక్ రాకీ (Mechanic Rocky)  కమర్షియల్‌గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో విశ్వక్ తన తదుపరి ప్రాజెక్టులను మరింత కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Vishwak Sen

Vishwak Sen career bounce back plans

ఇటీవల హిట్ 3 విషయంలో అతని పేరుతో రకరకాల కథనాలు వినిపించాయి. ఈ ఫ్రాంచైజ్‌లో తన పాత్రకు తగిన ప్రాముఖ్యత లేకపోవడం, స్క్రిప్ట్‌పై పూర్తి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాను చేయకపోవడమే మంచిధని డిసైడ్ చేశాడని టాక్. సాధారణంగా ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ అంటే హీరోలు క్యారెక్టర్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ విశ్వక్ మాత్రం తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే వెంటనే వెనుకడుగు వేస్తున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Those 3 heroes are Safe due to Vishwak Sen

ప్రస్తుతం అతడు ఫుల్ ఫోకస్‌తో ఫంకీ అనే కామెడీ సినిమాపై పని చేస్తున్నాడు. డైరెక్టర్ అనుదీప్ (Anudeep Kv)  ఈ సినిమాను పూర్తిగా కామెడీ బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నాడు. విశ్వక్ ఇప్పటివరకు ట్రై చేయని జానర్‌లో పూర్తి కొత్త లుక్, యాసతో కనపడబోతున్నాడట. మాస్ యాక్షన్ హీరోగా ముద్ర వేసుకున్న అతను, కామెడీ టచ్‌తో ఎంటర్‌టైన్ చేయడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Laila movie gives a big lesson to Vishwak Sen

ఇంకా ఈ నగరానికి ఏమైంది 2 (Ee Nagaraniki Emaindhi) విషయంలో దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో (Tharun Bhascker) మళ్లీ డిస్కషన్లు మొదలయ్యాయని తెలుస్తోంది. మొదటి భాగం టేకింగ్‌, కథనంతో మంచి హిట్ అందుకున్న ఈ కాంబో, ఇప్పుడు మరింత డిఫరెంట్ కథతో ముందుకెళ్లాలని చూస్తోంది. యూత్‌పుల్ సినిమాలే కాకుండా, ఓ అర్బన్ స్టైల్ సినిమా కూడా చేసేందుకు విశ్వక్ రెడీ అవుతున్నట్లు టాక్. ఇప్పటి వరకూ ఎప్పుడూ రిస్క్ తీసుకునే హీరోగానే పేరు తెచ్చుకున్న విశ్వక్, ఇప్పుడు మరింత జాగ్రత్తగా తన ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.