
బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) గురించి టాలీవుడ్‌లో తరచూ పుకార్లు వస్తుండేవి. ఇదిగో ఆ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా అనుకుంటున్నారు, అదిగో ఆ ప్రాజెక్ట్‌లో నటించబోయేది ఆమెనే అంటూ చెప్పుకొచ్చేవారు. అయితే ఏవీ నిజం కాలేదు. ఏ ప్రాజెక్టూ ఓకే కాలేదు. ఆ తర్వాతర్వాత ఆ పుకార్లు కూడా ఆగిపోయాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో కూడా ఆమె సినిమాల ప్రస్తావన పెద్దగా వినిపించడం లేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత సోనాక్షి సిన్హా ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది అంటూ పుకార్లు మొదలయ్యాయి.
Sudheer Babu
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘జఠాధర’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసమే సోనాక్షి సిన్హాను టీమ్ సంప్రదించింది అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) సోదరి శిల్పా శిరోద్కర్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధించిన రహస్యాల నేపథ్యంలో ‘జఠాధర’ సినిమా సాగుతుంది అని దర్శకుడు వెంకట్ కల్యాణ్ ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు.
ఇందులో హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉందట. పాన్ ఇండియా ఫీల్, టచ్ కోసం బాలీవుడ్ నాయికలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోనాక్షి సిన్హా పేరు పరిశీలనకు వచ్చింది అని చెబుతున్నారు. ఆమెకు తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసిన అనుభవం లేదు కానీ.. రజనీకాంత్ (Rajinikanth) ‘లింగ’ (Linga) సినిమా చేసిన ఎక్స్‌పీరియెన్స్ ఉంది.
సోనాక్షి బాలీవుడ్‌లో ఇప్పుడు ఒక్క సినిమానే ఉంది. ‘నికితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే ప్రాజెక్ట్ ఉంది. గతేడాది ఆమె ‘కాకుడా’ అనే సినిమా చేసింది. దాంతోపాటు ‘బడేమియా చోటే మియా’లో ఓ చిన్న పాత్ర పోషించింది. ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. అందులో నటనకుగాను మంచి పేరు సంపాదించుకుంది.
26 ఏళ్ళ ‘యమజాతకుడు’ సినిమా ఫలితం వెనుక మెయిన్ రీజన్ అదే..!