
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ (Bhagyashree) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ‘యువరత్న రాణా’ సినిమాలో చెల్లెలి పాత్రతో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించింది లేదు.అయితే 2022 లో ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) దర్శకత్వంలో వచ్చిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె ప్రభాస్ (Prabhas) తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. అలాగే వి.వి.వినాయక్ (V. V. Vinayak) దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) నటించిన హిందీ ‘ఛత్రపతి’ లో కూడా నటించింది.
Bhagyashree
ఈ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో మళ్ళీ సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. అయితే ఇటీవల ఈమె గాయాల పాలైనట్లు ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ తలకి బలమైన గాయం అయ్యిందట. ఈ క్రమంలో ఆమె నుదుటికి 13 కుట్లు పడ్డాయి అని సమాచారం. ఈ మధ్య ఓ సందర్భంలో ఆమె పికిల్ బాల్ ఆడుతున్న క్రమంలో నుదిటికి గాయమైనట్లు స్పష్టమవుతుంది.
దీంతో సర్జరీలో భాగంగా ఆమెకు వైద్యులు ముందుగా ఆమెకు 13 కుట్లు వేసినట్లు సమాచారం.హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వస్తున్న టైంలో భాగ్యశ్రీ తీసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలను గమనిస్తే.. ఆమె నుదిటికి డీప్ గా కట్ అయినట్టు స్పష్టమవుతుంది. అయితే అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రస్తుతం భాగ్యశ్రీ కండిషన్ బాగానే ఉంది. కాస్ట్ లీ మెడిసిన్ వాడుతుండటం వల్ల మరో వారం, పది రోజుల్లో గాయం మాడిపోతుందట.