March 13, 202505:35:47 PM

Vishwambhara Vs Thammudu: మే 9ని ఖాళీగా వదిలేస్తున్నారా.. కన్ఫ్యూజన్లో నితిన్ సినిమా యూనిట్!

Vishwambhara vs Thammudu on Release Date

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం వాయిదా వేసుకున్నారు. అందువల్ల ప్యాచ్ వర్క్ ను కూడా పక్కన పెట్టారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ సినిమాకి సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. దానికంటే ముందు ఓటీటీ బిజినెస్ కూడా జరగడం లేదు అని అన్నారు. అది వేరే సంగతి. ఇప్పుడు ఓటీటీ బిజినెస్ అనేది ఓ కొలిక్కి వచ్చేసింది. అయితే ‘విశ్వంభర’ రిలీజ్ కి సరైన సీజన్ సమ్మర్ అనే చెప్పాలి.

Vishwambhara Vs Thammudu:

Vishwambhara vs Thammudu on Release Date

మే 9 కి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ దానిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆ టైంలో స్కూల్స్ కి శెలవలు ఉంటాయి. కాబట్టి సోషియో ఫాంటసీ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎగబడి వస్తారు. నిర్మాతలు పెట్టిన బడ్జెట్ కి కూడా న్యాయం జరుగుతుంది. కానీ ‘విశ్వంభర’ ప్యాచ్ వర్క్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తవ్వలేదు. దీంతో ఆగస్టుకి వెళ్లే అవకాశం కూడా ఉంది.

కనీసం ఆ విషయంపై కూడా వారు క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ ‘విశ్వంభర’ కనుక మే 9న రాకపోతే నితిన్ (Nithiin) ‘తమ్ముడు’ (Thammudu)  సినిమాని ఆ డేట్ కి రిలీజ్ చేయాలని దిల్ రాజు (Dil Raju) భావిస్తున్నారు. ఈ విషయంపై నిర్మాతలను అడిగితే ఆయనకు క్లారిటీ వచ్చేస్తుంది. కానీ అందుకు దిల్ రాజు ఉత్సాహం చూపడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ‘విశ్వంభర’ ని పోస్ట్ పోన్ చేసుకోమని ‘గేమ్ ఛేంజర్’ కోసం దిల్ రాజు అడిగారు.

Vishwambhara vs Kubera Box-office war

ఇప్పుడు మళ్ళీ తన సినిమా కోసం అడగడం కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. ఒకవేళ ‘విశ్వంభర’ పోస్ట్ పోన్ అయినట్లు ప్రకటిస్తే.. ‘తమ్ముడు’ ని ఆ డేట్ కి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తారట. మరోపక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘పతంగ్’ వంటి చిన్న సినిమా కూడా మే 9 డేట్ పై కన్నేసినట్టు టాక్ నడుస్తుంది. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించింది లేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.