March 16, 202509:33:13 AM

కిరణ్ అబ్బవరం ఎక్కడా తగ్గడం లేదుగా..!

Latest Update on Kiran Abbavaram K-RAMP (1)

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) .. ‘క’ (KA)  అనే సినిమాతో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. అదే జోష్ తో ‘దిల్ రుబా’ (Dilruba) అనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. మార్చి 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇది ఒక లవ్ స్టోరీ. కానీ కిరణ్ రోల్ కొత్తగా ఉండబోతుంది అని టీజర్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్లారిటీ ఇచ్చారు. ‘క’ సినిమాకి ముందు వరకు కిరణ్ అబ్బవరం చాలా వరకు ఒక్కటే లుక్ తో సినిమాలు చేస్తూ వచ్చాడు.

Kiran Abbavaram

దీంతో అతనిపై ట్రోలింగ్ కూడా ఎక్కువగా జరిగేది. దానికి కారణం ఏంటి అనేది కూడా కిరణ్ వివరించడం జరిగింది. ‘వరుసగా సినిమాలు చేస్తుండటం వల్ల.. నిద్ర కూడా ఉండేది కాదు. అందుకే లుక్స్ మార్చడం కుదిరేది కాదు’ అని కిరణ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ‘క’ సినిమా కంప్లీట్ అయ్యే వరకు అతను మరో సినిమా ఒప్పుకోలేదు. ఆ సినిమా కోసమే పూర్తి సమయం కేటాయించి లుక్ ను మెయింటైన్ చేశాడు. ఇక ఆ సినిమా తర్వాత ‘దిల్ రుబా’ విషయంలో కూడా అదే పద్దతిని ఫాలో అవుతూ వచ్చాడు.

Tollywood young hero about Guntur Kaaram movie

ఈ సినిమాలో కూడా కిరణ్ లుక్ కొత్తగా ఉంది. ఇక దీని తర్వాత చేయబోతున్న ‘కె ర్యాంప్’ (K-RAMP) సినిమాలో కూడా కిరణ్ సరికొత్తగా కనిపిస్తాడట. ఈ సినిమా కోసం కిరణ్ 6 ప్యాక్ చేయబోతున్నాడట. అందుకోసం జిమ్లో కసరత్తులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ఏకంగా 20 లిప్ లాక్ సీన్స్ ఉంటాయట. ‘రంగబలి’ (Rangabali) ‘మార్కో’ (Marco) వంటి సినిమాలతో పాపులర్ అయిన యుక్తి తరేజా (Yukti Thareja) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.