
శ్రీకాంత్ (Srikanth) తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్ (Roshan Meka). దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) కాంబినేషన్లో రూపొందిన చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’ తో (Rudramadevi) అతను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో అతను రానా (Rana) చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించాడు. తర్వాత ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో కూడా నటించాడు. అయితే అతను హీరోగా డెబ్యూ ఇచ్చిన సినిమా ‘పెళ్ళిసందD’. 2020 లో విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడి 2021 లో రిలీజ్ అయ్యింది.
Champion Glimpse Review:
శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో రోషన్ డెబ్యూ మూవీతోనే సక్సెస్ అందుకున్నట్టు అయ్యింది. అందువల్ల కంగారు పడి అతను వెంటనే సినిమాలు చేయలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని మంచి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకున్నాడు. అయితే చిన్న గ్యాప్ అనుకుంటే.. ఏకంగా 4 ఏళ్ళు టైం పట్టేసింది. రోషన్ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి మోహన్ లాల్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా.
మరొకటి అతను సోలో హీరోగా చేస్తున్న ‘ఛాంపియన్’ (Champion) మూవీ. టాలీవుడ్లో టాప్ బ్యానర్ అయినటువంటి ‘వైజయంతి మూవీస్’ సంస్థ ‘ఛాంపియన్’ సినిమాని నిర్మిస్తుంది. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ అద్వైతం దీనికి దర్శకుడు. ఈరోజు రోషన్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ ని వదిలారు. ఇందులో అతని లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. యాక్షన్ మోడ్లో కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు రోషన్. మీరు కూడా ఓ లుక్కేయండి :