
ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ‘కోర్ట్’ (Court) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరో శివాజీ (Sivaji) కూడా ఇందులో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కథలెన్నో’ అనే పాట సూపర్ హిట్ అయ్యింది. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ట్రైలర్ ని కూడా వదిలారు. ‘కోర్ట్’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 57 సెకన్ల నిడివి కలిగి ఉంది.
Court Trailer Review:
ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించినందుకు గాను ఒక కుర్రాడిపై అతని తండ్రి కక్ష్య కట్టి ఫోక్సో వంటి పలు కఠినమైన సెక్షన్లతో కేసు పెట్టించడం.. ఆ తర్వాత అతన్ని 70 రోజులకు పైగా పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. ఇది తెలుసుకున్న ఓ కుర్ర లాయర్(ప్రియదర్శి) ఆ పిల్లడు నిర్దోషి అని ఎలా నిరూపించాడు. అందుకు అతను చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ అని ట్రైలర్ చెబుతుంది.
‘కోర్టు’ ట్రైలర్ చూస్తుంటే తమిళంలో సూర్య (Suriya) హీరోగా రూపొందిన ‘జై భీమ్’ , తెలుగులో అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా రూపొందిన ‘నాంది’ వంటి సినిమాలు గుర్తుకొస్తున్నాయి. అంత ఎమోషన్ ఈ కథలో కూడా ఉంది అని స్పష్టమవుతుంది. ‘ఫోక్సో’ చట్టం అనేది మొన్నామధ్య జానీ మాస్టర్ (Jani Master) అరెస్ట్ వల్ల బాగా ట్రెండ్ అయ్యింది. సో ‘కోర్ట్’ పై ఆసక్తి పెరగడానికి అదొక కారణం అని చెప్పాలి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :