
‘క’ తో (KA) మంచి విజయాన్ని అందుకుని ఫామ్లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరో రెండు రోజుల్లో ‘దిల్ రుబా’ తో (Dilruba) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీని టీజర్, ట్రైలర్, పాటలు యూత్ ను అలరించాయి. దీంతో ఈ సినిమాపై వాళ్ళ అటెన్షన్ ఏర్పడింది. కిరణ్ అబ్బవరం లుక్ కూడా ఇందులో చాలా కొత్తగా ఉంది. అలాగే హీరోయిన్స్ గ్లామర్ కూడా ఈ సినిమాకి ఒక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. విశ్వ కరుణ్ (Vishwa Karun) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘శివమ్ సెల్యులాయిడ్స్’, ‘సారెగమ’ ‘ఏ యూడ్లీ’ సంస్థలపై రవి, జోజో జోస్ (Jojo Jose), రాకేష్ రెడ్డి (Rakesh Reddy) ని నిర్మించారు.
Dilruba
మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు రోజు నుండే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘దిల్ రుబా’ సినిమా ‘క’ కంటే ముందే స్టార్ట్ అయ్యింది. ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) తర్వాత కిరణ్ అబ్బవరం నుండి రావాల్సిన సినిమా ఇదే. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. మెయిన్ గా బడ్జెట్ సమస్యలు తలెత్తడం వల్ల ఆలస్యం అయ్యింది అనే టాక్ కూడా ఉంది. అనుకున్నదానికంటే ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవ్వడం..
‘రూల్స్ రంజన్’ టైంలో కిరణ్ అబ్బవరం మార్కెట్ డల్ అవ్వడంతో.. సినిమాని హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వినిపించాయి.అందుకే ‘క’ ని ముందుగా రిలీజ్ చేశారు. అది హిట్ అవ్వడంతో ‘దిల్ రుబా’ కి బిజినెస్ బాగా జరుగుతుంది అని ఆశించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు రూ.18 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందట. రూ.4 కోట్లకి ఓటీటీ డీల్ వచ్చినట్టు సమాచారం.
శాటిలైట్, హిందీ డబ్బింగ్ వంటి రూపంలో మరో రూ.4 కోట్లు లేదా రూ.5 కోట్లు రావచ్చు. అది మొత్తం కలుపుకొని రూ.9 కోట్లు అనుకున్నా. ఇంకో రూ.9 కోట్లు థియేట్రికల్ నుండి రావాలి.నిర్మాతలే చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తం రాబడుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.