
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా మారతాయి. ఇప్పుడు అలాంటి సంచలనమైన కాంబోపై చర్చ నడుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మాస్ యాక్షన్ మాస్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతున్నట్లు టాక్ ఊపందుకుంది. ‘కేజీఎఫ్’ (KGF) సిరీస్, ‘సలార్’తో (Salaar) తన స్టైల్‌ను ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ నీల్, ఇప్పుడు బన్నీతో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న వ్యక్తి నిర్మాత దిల్ రాజు.
Allu Arjun, Dil Raju:
ఇప్పటికే ప్రశాంత్ నీల్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయాలని ఒప్పుకున్నా, అది ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. అయితే ‘గేమ్ చేంజర్’ (Game Changer) డిజాస్టర్ నేపథ్యంలో, బన్నీ మరో సినిమా దిల్ రాజు బ్యానర్‌లో చేయాలని అంగీకరించినట్లు టాక్. దాంతో, దిల్ రాజు (Dil Raju) ఈ గోల్డెన్ కాంబినేషన్‌ను ఒక బిగ్ ప్రాజెక్ట్‌గా మార్చేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ తక్కువ.
బన్నీ ముందుగా అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది. అదే సమయంలో త్రివిక్రమ్ (Trivikram) కూడా లైన్‌లో ఉన్నాడు. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘సలార్ 2’ కూడా షెడ్యూల్‌లో ఉంది. ఈ కాంబో సినిమా కోసం ఇద్దరికీ కాస్త ఎక్కువ టైమ్ కావొచ్చు. కానీ, ఒకసారి ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వడం ఖాయం.
‘పుష్ప’తో (Pushapa) రఫ్ మాస్ లుక్‌లో ఆకట్టుకున్న బన్నీ, ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, రా మాస్ ఎలిమెంట్స్‌తో మరో లెవెల్ సినిమా ఇవ్వబోతున్నాడనే అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్‌లో బన్నీ క్రేజ్, ప్రశాంత్ నీల్ స్టైల్ కలిసి వస్తే, పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డుల వేట మొదలయ్యే అవకాశం ఉంది.