March 20, 202505:40:08 PM

Leon James: బాబు తెలుగు ఫిలిం మేకర్స్.. కొంచెం మారండయ్యా..!

Is Music Director Leon James necessary for Tollywood (1)

పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే అని చాలా మంది అంటుంటారు. కానీ ఒక్కోసారి రిలీజ్ టైంలో పాటలు ఎక్కకపోయినా.. తర్వాత సినిమాకి హిట్ టాక్ వస్తే.. పాటలు కూడా చార్ట్ బస్టర్స్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాజమౌళి – కీరవాణి కాంబినేషన్లో వచ్చిన సినిమాల విషయంలో ఎక్కువగా ఇదే జరిగింది. సినిమా చూశాక.. కీరవాణి (M. M. Keeravani) మ్యూజిక్ ని ఎక్కువగా ప్రశంసిస్తూ ఉంటారు. ఎందుకంటే రాజమౌళి (S. S. Rajamouli) సినిమా అంటే.. సిట్యుయేషన్ కి తగ్గట్టు మ్యూజిక్, పాటలు వస్తుంటాయి.

Leon James

సరే ఈ టాపిక్ అంతా ఎందుకు. అసలు విషయానికి వచ్చేద్దాం. తెలుగులో చాలా మంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ మన ఫిలిం మేకర్స్ ఎక్కువగా పక్క భాషల ఫిలిం మేకర్స్ కే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. సామ్ సి ఎస్ (Sam C. S.) తెలుగు సినిమాలకి గొప్ప పాటలు ఇచ్చిన సందర్భాలు లేవు. అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath) కూడా అంతే..! కాకపోతే వాళ్లిద్దరూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరక్కొట్టేస్తారు. వీరిలానే తెలుగులో కూడా బిజీ అయిపోవాలి అనుకుంటున్నాడు లియోన్ జేమ్స్ (Leon James).

తెలుగులో ‘నెక్స్ట్ ఏంటి?’ (Next Enti?) ‘ఓరి దేవుడా’ (Ori Devuda)  ‘దాస్ క ధమ్కీ’ (Das Ka Dhamki) ‘లైలా’ (Laila) ‘మజాకా’ (Mazaka) వంటి సినిమాలకి పనిచేశాడు. ఇందులో ‘ఓరి దేవుడా’ లో ‘గుండెల్లోనా’, ‘దాస్ క ధమ్కీ’ లో ‘ఆల్మోస్ట్ పడిపోయానే’ అనే పాటలు తీసేస్తే ఇక ఏ పాట కూడా హిట్ అయ్యింది లేదు. ఇటీవల వచ్చిన ‘మజాకా’ సినిమాలోని పాటలు అయితే చాలా దారుణం. త్రినాధ్ రావ్ నక్కిన (Trinadha Rao) సినిమాకి మొదటిసారి భీమ్స్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. లియోన్ జేమ్స్ (Leon James) మ్యూజిక్ ఆ సినిమాకి మేజర్ మైనస్.

అయినా సరే తెలుగు ఫిలిం మేకర్స్ లియోన్ జేమ్స్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి యంగ్ హీరోల సినిమాలకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ‘దూరపు కొండలు నునుపు’ అని పెద్దలు ఊరికే అనలేదు. తెలుగులో చాలా మంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా.. ఎందుకు మన వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారో.

‘కన్నప్ప’ రెండో పాట ఇలా హాట్ టాపిక్ అయ్యింది!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.