
సందీప్ కిషన్ (Sundeep Kishan) , రావు రమేష్ (Rao Ramesh) కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మజాకా’ (Mazaka) .’ధమాకా’ (Dhamaka) తో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దీనికి దర్శకుడు. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar)కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు.
Mazaka Collections:
రీతూ వర్మ(Ritu Varma) , ‘మన్మధుడు’ బ్యూటీ అన్షు (Anshu Ambani) హీరోయిన్లు. సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం సో సోగానే వచ్చాయి.బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా చాలా ఉంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.38 cr |
సీడెడ్ | 0.55 cr |
ఉత్తరాంధ్ర | 0.58 cr |
ఈస్ట్ | 0.19 cr |
వెస్ట్ | 0.15 cr |
గుంటూరు | 0.35 cr |
కృష్ణా | 0.32 cr |
నెల్లూరు | 0.14 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.66 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.71 cr |
తెలుగు వెర్షన్ (టోటల్) | 4.37 cr |
‘మజాకా’ (Mazaka) చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.4.37 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.8.25 కోట్లు రాబట్టింది.