March 20, 202511:17:06 PM

Nayanthara: నయన్ ఈ టెస్ట్ పాసయ్యేనా?

Nayanthara career turning point with Test movie

నయనతార (Nayanthara) ఇప్పుడు కొత్త ప్రయోగం చేయబోతోంది. ఈమధ్య థియేటర్ రిజల్ట్‌లు పెద్దగా కలిసి రాకపోవడంతో, తన దృష్టిని OTT వైపు మళ్లించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘టెస్ట్’ (Test) సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 4న స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్ మార్కెట్‌లో ప్రస్తుతం సరైన స్థాయిలో నిలదొక్కుకోవడం కష్టమవుతోన్న నయనతారకు, ఇది కీలకమైన స్టెప్‌గా మారనుంది. ఈ సినిమా కథ ప్రధానంగా ఒక సాధారణ మహిళ జీవితాన్ని కేంద్రీకరిస్తుందని సమాచారం.

Nayanthara

Nayanthara career turning point with Test movie

అనుకోని సంఘటనల కారణంగా ఆమె జీవితంలో ఏర్పడే మార్పులు, ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటుందనే అంశాలపై కథ నడుస్తుందని తెలుస్తోంది. తమిళ సినిమాగా రూపొందినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ద్వారా పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరుకోనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, నయనతార పాత్రపై ఆసక్తిని పెంచింది. నయనతార షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) సరసన ‘జవాన్’ (Jawan) సినిమాలో నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి పాత్ర చేసినప్పటికీ, ఆ క్రేజ్‌ను కొనసాగించలేకపోయింది.

ముఖ్యంగా ఉత్తరాది మార్కెట్‌లో తన స్థాయిని మరింత పెంచుకునేలా ప్రాజెక్టులు చేయకపోవడం ఆమెకు మైనస్ అయ్యింది. అంతేకాదు, ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వివాదంలో ఇరుక్కొనడంతో ఆమెకు ఇబ్బందులు మరింత పెరిగాయి. ఇలాంటి టైమ్‌లో ఆమెకు ‘టెస్ట్’ ఒక గేమ్‌చేంజర్ అవుతుందా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇది పూర్తిగా నయనతారపై ఆధారపడి నడిచే సినిమా కాబట్టి, ఆడియెన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, ఆమెకు మళ్లీ బ్రేక్ లభించొచ్చు.

Nayanthara career turning point with Test movie

OTT ఫార్మాట్‌లో తన రేంజ్‌ను పెంచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇక, నయనతార ఈ ‘టెస్ట్’ను పాస్ అవుతుందా లేదా ఆమె కెరీర్‌కి ఇది మరో నెగటివ్ అవుతుందా? అనేది ఏప్రిల్ 4 తర్వాతే తేలనుంది. ఒకవేళ ఇది హిట్ అయితే, భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన ప్రాజెక్టులు చేయడానికి నయనతార ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. చూడాలి మరి అమ్మడి లక్కు ఎలా ఉంటుందో?

కిరణ్ అబ్బవరం.. పర్ఫెక్ట్ బిజినెస్ స్ట్రాటజీ!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.