
టాలీవుడ్ మాస్ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజ, ఎప్పుడూ పక్కా మాస్ కథలనే ఎంచుకుంటాడు. ఊరమాస్ డైలాగులు, ఫుల్ ఎనర్జీ యాక్షన్, బోర్డర్ క్రాస్ చేసే కామెడీ.. ఇవన్నీ కలిపితేనే రవితేజ సినిమాల సూత్రం. కానీ, కొన్నిసార్లు రూట్ మార్చి క్లాస్ సినిమాలను కూడా ట్రై చేశాడు. కానీ, అవి అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే, రవితేజ మళ్లీ తన మాస్ స్టైల్‌కే కట్టుబడి ఉంటూ వచ్చాడు. అయితే, ఇప్పుడు రవితేజ (Ravi Teja) అనూహ్యంగా మారాడు. టాలీవుడ్‌లో క్లాస్ సినిమాల స్పెషలిస్ట్ అయిన కిషోర్ తిరుమలతో (Kishore Tirumala) సినిమా చేయనున్నాడట.
Ravi Teja
నేను శైలజ (Nenu Sailaja), ఉన్నది ఒక్కటే జీవితం (Vunnadhi Okate Zindagi), చిత్రలహరి (Chitralahari) లాంటి సున్నితమైన కథలు చెప్పడంలో క్లాస్ మేకర్‌గా పేరు తెచ్చుకున్న కిషోర్.. రవితేజతో కలిసి మాస్ ఎంటర్‌టైనర్ చేయాలనుకుంటున్నాడట. ఇదే కనుక కన్ఫామ్ అయితే, రవితేజ కెరీర్‌లో కొత్తగా చూడదగ్గ కాంబో అవ్వొచ్చు. ఇప్పటివరకు రవితేజ ఎక్కువగా మాస్ డైరెక్టర్లతోనే పనిచేశాడు. కానీ, కిషోర్ తిరుమల కాస్త డిఫరెంట్. తను క్లాస్, ఫీల్ గుడ్ ఎమోషన్ ప్రధానమైన సినిమాలు తీసినప్పటికీ, మాస్ ఎలిమెంట్స్‌తోనూ మిక్స్ చేసే టాలెంట్ అతనికి ఉంది.
అందుకే, ఇప్పుడు రవితేజతో కలిసి సరికొత్త జానర్ టచ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇదే కిషోర్ తిరుమలకు కూడా మంచి ఛాన్స్. గత కొంతకాలంగా కమర్షియల్ హిట్ లేక డైరెక్ట్ గా వెనకబడ్డ అతను, మాస్ హీరోతో కలిసి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేస్తే, మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
మాస్ ఇమేజ్ ఉన్న హీరో, క్లాస్ టచ్ ఉన్న డైరెక్టర్.. ఈ కాంబో కలిస్తే మాత్రం, టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త రికార్డులు ఖాయమనే చెప్పాలి. మొత్తానికి, ఈ కాంబోపై ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. రవితేజ కూడా కొత్తగా కనపడే కథ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.