
రీ- రిలీజ్ సినిమాల ట్రెండ్ ముగిసింది అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం, సోషల్ మీడియాలో దాని హడావిడి నడుస్తుండటం.. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు రీ- రిలీజ్ అయిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి. రాంచరణ్ (Ram Charan) ‘ఆరెంజ్’ (Orange), ఎన్టీఆర్ (Jr NTR) ‘సింహాద్రి’ (Simhadri) కూడా రీ- రిలీజ్లో సత్తా చాటాయి. ఆఖరికి ‘ఓయ్’ (Oye) ‘హ్యాపీడేస్’ (Happy Days) ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindhi) వంటి సినిమాలు కూడా రీ- రిలీజ్ అయ్యి మంచి ఫలితాలను అందుకున్నాయి.
Salaar Re-release:
కాకపోతే ప్రభాస్ (Prabhas) పేరుపై మాత్రం ఎటువంటి రికార్డు లేదు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘రెబల్’ (Rebel) ‘బిల్లా’ (Billa) ‘ఈశ్వర్’ (Eeswar) ‘యోగి’ (Yogi) వంటి సినిమాలు రీ- రిలీజ్ అయ్యాయి. అవి రీ- రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు. పవన్,మహేష్ అభిమానులు తమ హీరోలకి చేస్తున్న హడావిడి వంటివి.. ప్రభాస్ ఫ్యాన్స్ చెయ్యట్లేదు. అందువల్ల ప్రభాస్ రీ- రిలీజ్ సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పింది లేదు. బహుశా అందుకే అనుకుంటా..
ఈ వారం రీ- రిలీజ్ అవుతున్న ‘సలార్'(సీజ్ ఫైర్) కి (Salaar) గట్టిగా హడావిడి చేస్తున్నారు. బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్కుంటే.. 40 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. రిలీజ్ రోజుకి ఇంకా పెరగవచ్చు. చూస్తుంటే ఈసారి ‘కాటేరమ్మ’ కొడుకు రికార్డు కొట్టేలా కనిపిస్తున్నాడు. ‘బాహుబలి’ (Baahubali) తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమాల్లో ‘సలార్’ కి మాస్ ఫ్యాన్స్ ఉన్నారు.ఏడాది పాటు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ట్రెండ్ అయ్యింది.