
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సినిమాల్లో పాటలకు ఎవరు సంగీతం అందించినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆయనొక్కరే అందిస్తారు. అంతగా ఆర్‌ఆర్ విషయంలో సందీప్ రెడ్డి వంగా ఆ వ్యక్తిని నమ్మేస్తారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు సందీప్ చేసిన మూడు సినిమాలల్లోనూ ఆ వ్యక్తి తన ముద్ర వేస్తూ వచ్చారు. ఆ ముద్రే ‘విజిల్’. ఈ ఇద్దరి కాంబో సినిమా నడుస్తూ ఉంటే.. బ్యాగ్రౌండ్‌లో విజిల్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఇచ్చింది హర్షవర్ధన్ రామేశ్వర్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో ఆయన చాలా స్పెషల్ అని చెబుతుంటారు సినిమా పరిశ్రమలో.
Spirit
ఇప్పుడు ఆయన ప్రభాస్ (Prabhas) ‘స్పిరిట్’ (Spirit) సినిమాకు కూడా పని చేస్తున్నారు. అయినా ఆయన పని చేయకపోతేనే ఇష్యూ. ఎందుకంటే సందీప్ – హర్షవర్ధన్‌ది అంతటి బాండింగ్. అయితే ‘స్పిరిట్’ సినిమా విషయంలో మరో స్పెషల్ ఉందట. అయితే ప్రభాస్‌కి హర్షవర్ధన్ పెద్ద ఫ్యాన్ అట. ప్రభాస్ అంటే అభిమానమని, కసిగా పని చేస్తున్నాన అని క్లారిటీ ఇచ్చేశారాయన. ఇంకా ఆయన చెబుతూ సందీప్ రెడ్డితో కలసి చేసిన సినిమాల్లో విజిల్ సౌండ్ సెంటిమెంట్‌గా వస్తోందని, ‘స్పిరిట్’ సినిమాకు కూడా ఆ సౌండ్‌ని కొనసాగిస్తామని చెప్పారు.
‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) , ‘కబీర్‌సింగ్’ సినిమాలకు షూటింగ్ పూర్తయిన తర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తే.. ‘యానిమల్’ (Animal) సినిమా చిత్రీకరణకు ముందే సంగీతం ఇచ్చానని చెప్పారాయన. ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమా విషయంలోనూ ఇదే తరహాలో పని చేస్తున్నారని సమాచారం. ఇక ‘స్పిరిట్’ సినిమా గురించి చూస్తే.. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారిగా పోలీసు అధికారిగా కనిపించనున్నాడు.
అయితే ఆ పాత్ర చాలా వైల్డ్‌గా ఉంటుంది అని అంటున్నారు. ముంబయి అండర్ గ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అని అంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన సినిమాలకు డేట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పడు షురూ అయ్యేది తెలియాల్సి ఉంది.