March 22, 202501:58:30 AM

SSMB29 : ఒక్క పిక్ తో జోనర్ కూడా లీక్ అయిపోయింది..!

Rajamouli to Recreate Kashi for Mahesh Babu's SSMB29 (1)

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా.. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా మొదలైంది. ప్రియాంక చోప్రాపై (Priyanka Chopra) కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మరోపక్క మహేష్ బాబు జిమ్ములో తెగ వర్కౌట్లు చేస్తూ వస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

SSMB29

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

అయితే ఇంత జరుగుతున్నా.. ఈ సినిమాని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది లేదు. రాజమౌళి పలు ఈవెంట్లలో దీని గురించి చెప్పడం తప్ప ఇంకెవ్వరూ స్పందించింది లేదు అనే చెప్పాలి. అయితే ప్రాజెక్టు అనౌన్స్ చేసే టైంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి.. దాని వివరాలు అధికారికంగా తెలపడం అనేది రాజమౌళికి అలవాటు. ఈసారి కూడా అదే చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. మహేష్- రాజమౌళి సినిమా కోసం హైదరాబాద్ శివారులో ఓ కాశీ సెట్టు వేస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది.

అది వట్టి గాసిప్పే అని అంతా అనుకున్నారు. కానీ అది నిజమే అనేది లేటెస్ట్ టాక్. మహేష్ – రాజమౌళి సినిమా కోసం నిజంగానే హైదరాబాద్లో కాశీ సెట్టు వేశారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా మైథాలజీ కాన్సెప్ట్ తో కూడినది అని టాక్ నడిచింది. సో ఈ కాశీ సెట్టు చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. మరోపక్క ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు కూడా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ – రవి కిరణ్ కోలా సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.