
ఎప్పుడో 2008లో కెరీర్ స్టార్ట్ చేసిన సుశాంత్ కు (Sushanth) “చిలసౌ” మినహా హిట్ అనేది లేదు. 17 ఏళ్ల కెరీర్లో కేవలం ఎనిమిది సినిమాలు చేశాడు సుశాంత్. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం అనేది పక్కన పెడితే.. ఒక నటుడిగా స్థిరపడడానికి కూడా ఇబ్బందిపడుతూ వస్తున్నాడు. నిజానికి అతడికి ఉన్న అక్కినేని బ్యాగ్రౌండ్ కానీ, ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలకు కానీ ఈపాటికి ఒక నటుడిగా సెటిల్ అయిపోవాలి. కాస్త లేటుగా క్యారెక్టర్ రోల్స్ కి ఒకే చెప్పిన సుశాంత్ కి “అల వైకుంఠపురములో” (Ala Vaikunthapurramuloo) సినిమాకి మంచి లాంచ్ ప్యాడ్ దొరికినా ఆ తర్వాత వచ్చిన “రావణాసుర (Ravanasura), భోళా శంకర్” (Bhola Shankar)లతో సరైన విజయాలు అందుకోలేక ఇబ్బందిపడ్డాడు.
Sushanth
అందువల్ల క్యారెక్టర్ రోల్స్ పరంగానూ సరైన స్థాయి పాత్రలు అందుకోలేకపోయాడు. దాంతో మళ్లీ కాస్త గ్యాప్ తీసుకొని ఓ కొత్త జోనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుశాంత్. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో వరుణ్ కుమార్ – రాజ్ కుమార్ ద్వయం నిర్మించనున్న ఈ చిత్రం పోస్ట్ ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యి.. త్వరలో షూట్ కి వెళ్లనున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు.
అయితే.. ఈ చిత్రంలో సుశాంత్ ఎగ్జార్జిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. అంటే.. దెయ్యాలు వదిలించే పాత్ర అన్నమాట. సుశాంత్ తన 17 కెరీర్లో నటిస్తున్న మొట్టమొదటి హారర్ సినిమా ఇదే కావడం గమనార్హం. మరి సుశాంత్ ఈ సినిమాతోనైనా హీరోగా హిట్టు కొడతాడా లేదా అనేది చూడాలి. ఇకపోతే.. సుశాంత్ ఓ ప్రొడక్షన్ బ్యానర్ ను మొదలుపెట్టి కొత్త టాలెంట్ ను ఇంట్రడ్యూస్ చేయనున్నాడని కూడా తెలుస్తోంది. మరి ఆ కొత్త బ్యానర్ & ప్రాజెక్ట్స్ వివరాలు బయటికి రావడానికి ఇంకొన్నాళ్ళ సమయం పడుతుందేమో.