
నేచురల్ స్టార్ నాని (Nani) మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దసరా (Dasara)వంటి హిట్ తర్వాత, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela) ది ప్యారడైజ్ (The Paradise) సినిమా చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాని లుక్, కథంతా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టీజర్‌తోనే అర్థమైంది. కానీ ఈ కథలో కీలకమైన పాత్రగా ఒక తల్లి క్యారెక్టర్ ఉండబోతుందని టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కోసం బాలీవుడ్, మరాఠీ సినీ ఇండస్ట్రీకి చెందిన టాలెంటెడ్ నటి సోనాలి కులకర్ణి Sonali Kulkarni తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
The Paradise
గతంలో హిందీలో దిల్ ఛాహతా హై, భరత్ వంటి చిత్రాల్లో నటించిన ఆమె తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. తెలుగు చిత్రసీమలో తల్లి పాత్రలకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకమైనది. బాహుబలి (Baahubali), కేజీఎఫ్ (KGF), సలార్ (Salaar) వంటి చిత్రాల్లో తల్లి పాత్రలు స్ట్రాంగ్ ఎమోషన్‌ను అందించాయి. ది ప్యారడైజ్లో కూడా అదే ఫార్ములా ఉపయోగించి, కథలో మదర్ సెంటిమెంట్‌ను బలంగా చూపించబోతున్నారని టాక్. ఇప్పటికే టీజర్‌లో ‘రక్తం పోసి పెంచిన కొడుకు’ అనే లైన్ హైలైట్ అయ్యింది.
ఇది సినిమాలో తల్లి పాత్ర ఎంత కీలకంగా ఉండబోతుందనే సంకేతాన్ని ఇస్తోంది. ఈ పాత్రలో సోనాలి కులకర్ణి కనిపించనున్నారని, ఆమె నటన సినిమా రేంజ్‌ను పెంచబోతుందని ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి. ఆమె గతంలో చేసిన చిత్రాల్లో ఎమోషనల్ రోల్స్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు తొలిసారి తెలుగు స్క్రీన్‌పై మెరవబోతుండటంతో, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథను మాఫియా, యాక్షన్ నేపథ్యంలో సాగేలా మలుస్తూనే, కుటుంబ బంధాలను హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈమధ్య టాలీవుడ్‌లో మదర్ క్యారెక్టర్స్ ఎంతగా ప్రభావం చూపుతున్నాయో చూస్తుంటే, ది ప్యారడైజ్లోనూ ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుందనేది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. నాని మరోసారి ఓ విభిన్నమైన కథతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయబోతున్నాడని ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. ఈ హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2026 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.