March 23, 202507:18:31 AM

Shahid Kapoor: తొక్కేస్తుంటే ఏమీ చేయలేకపోయా.. షాహిద్ కపూర్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో షాహిద్ కపూర్ ఒకరు. అయితే తాజాగా షాహిద్ కపూర్ తనకు ఎదురైన అవమానాలకు సంబంధించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. షాహిద్ కపూర్ పేరెంట్స్ ఇండస్ట్రీలోనే ఉన్నా వాళ్ల పేర్లు వాడుకోకుండానే షాహిద్ కెరీర్ ను మొదలుపెట్టారు. బ్యాగ్రౌండ్ లేనివాళ్లను ఎలా చూస్తారో నన్ను కూడా అలానే చూశారని ఆయన అన్నారు. నన్ను చులకనగా చూసి అవమానించారని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు.

ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన సమయంలో క్లాసులో నన్ను కూర్చోనివ్వలేదని వెల్లడించారు. నా యాస వేరుగా ఉండటం వల్ల నన్ను పరాయివాడిగా, అంటరానివాడిగా చూశారని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని 11 నెలలకు ఒకసారి ఇల్లు మారుతూ ఉండేవాళ్లమని షాహిద్ కపూర్ వెల్లడించారు. మాతో ఎవరూ కలుపుగోలుగా ఉండేవారు కాదని షాహిద్ కపూర్ అన్నారు. కాలేజ్ లో మాత్రం నన్ను యాక్సెప్ట్ చేశారని నాకంటూ మంచి స్నేహితులు దొరికారని షాహిద్ కపూర్ వెల్లడించారు.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత స్కూల్ గుర్తుకొచ్చిందని ఆయన అన్నారు. ఇక్కడ బయటినుంచి వచ్చే వాళ్లకు అంత సులువుగా అవకాశాలు ఇవ్వరని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు. హీనంగా చూస్తారని చాలా ఏళ్లు ఆ సమస్యతో బాధ పడ్డానని ఆయన కామెంట్లు చేశారు. నేను బాలీవుడ్ గ్యాంగ్ లో తిరిగే రకం కాదని మూవీ ఆఫర్ల కోసం అలా తిరగడం ఇష్టం ఉండదని షాహిద్ వెల్లడించారు. అలా అని వారు ఇతరులను తొక్కేయాలనుకోవడం, వారిని ఎదగకుండా చేయడం, అవమానించడం కూడా రైట్ కాదని ఆయన అన్నారు.

shahid kapoor

టీనేజ్ లో తిరిగి పోరాడేంత శక్తి నాకు లేకపోయిందని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. ఇప్పుడు (Shahid Kapoor) నన్ను వేధించాలని చూస్తే మాత్రం ఊరుకోనని తిరిగి పోరాడతానని ఆయన తెలిపారు. ఇతరులను వేధించి ఆనందించే వాళ్లను నేను కూడా వేధిస్తానని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు. అదే వారికి తగిన శిక్ష అని షాహిద్ వెల్లడించారు. షాహిద్ కపూర్ కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు అవమానాలను ఎదుర్కోవడం వల్లే ఈ తరహా కామెంట్లు చేశారని నెటిజన్లు చెబుతున్నారు. షాహిద్ కపూర్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.