Suma, Rajeev Kanakala: గర్భవతిగా ఉన్న సమయంలో ఆ సినిమాలు.. సుమ చెప్పిన విషయాలివే!

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. తాజాగా సుమ రాజీవ్ కనకాల 25వ పెళ్లిరోజును జరుపుకోవడం గమనార్హం. సుమ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో సుమ మీ భాగస్వామికి తెలియకుండా ఫోన్ చెక్ చేశారా అనే ప్రశ్నకు అవునని చెప్పారు. ప్రతి పెళ్లాం ఫోన్ చెక్ చేస్తుందని సుమ కామెంట్లు చేశారు. రాజీవ్ కు ఇళయరాజా, కీరవాణి పాటలు అంటే ఇష్టమని సుమ తెలిపారు.

సుమ మామూలు పెరుగు పచ్చడి మాత్రమే దారుణంగా చేస్తుందని రాజీవ్ కనకాల అన్నారు. బిగినింగ్ లో భాగస్వామికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని రాజీవ్ కామెంట్లు చేశారు. అలా చేయకపోతే వాళ్లు ఒంటరిగా ఫీలవుతారని ఆయన తెలిపారు. రాజీవ్ చెప్పింది అక్షర సత్యమని సుమ కూడా చెప్పుకొచ్చారు. నేను గర్భవతిగా ఉన్న సమయంలో రాజీవ్ దెయ్యాల సినిమాలు చూపించాడని సుమ కామెంట్లు చేశారు. పదేళ్ల క్రితం రాజీవ్ ఫోన్ చెక్ చేశానని సుమ పేర్కొన్నారు.

సుమ, రాజీవ్ పానీపూరీ ఛాలెంజ్ లో పాల్గొనగా రాజీవ్ కనకాల విజేతగా నిలిచారు. 30 సంవత్సరాలు సుమను ఎలా భరించానా అని ఇప్పుడు ఆలోచిస్తానని రాజీవ్ సరదాగా కామెంట్లు చేశారు. ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. సినిమాల విషయంలో మేమిద్దరం గొడవ పడేవాళ్లమని సుమ, రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

(Suma) సుమ, రాజీవ్ కనకాల కలకాలం అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సుమ, రాజీవ్ ప్రస్తుతం పిల్లల కెరీర్ పై దృష్టి పెట్టారు. సుమ కొడుకు నటించిన బబుల్ గమ్ మూవీ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. రాజీవ్ కనకాల కూడా కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.


Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.