March 29, 202503:53:13 PM

50 రిలీజ్ అయితే.. 2 హిట్ అయ్యాయా?

ఫిబ్రవరి అనేది టాలీవుడ్ కి డ్రై సీజన్ అని అంటుంటారు. ఈ నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ కావు. రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్లు కావు అనే నమ్మకం ఇండస్ట్రీ జనాల్లో గట్టిగా ఉంది. ఫిబ్రవరి నెలలో బ్లాక్ బస్టర్స్ అయినవి కూడా ఎక్కువగా మిడ్ రేంజ్, చిన్న సినిమాలు మాత్రమే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా..2024 ఫిబ్రవరి విషయానికి వస్తే.. కొత్తగా అద్భుతాలు జరిగింది అంటూ ఏమీ లేదు. ఈసారి 50 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి.

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ‘బూట్ కట్ బాలరాజు’ ‘ధీర’ ‘గేమ్ ఆన్’ ‘హ్యాపీ ఎండింగ్’ ‘ఐ హేట్ యు’ ‘కిస్మత్’ ‘మెకానిక్’ ‘యాత్ర 2 ‘ ‘ఈగల్’ ‘ట్రూ లవర్’ ‘రాజధాని ఫైల్స్’ ‘ఐ హేట్ లవ్’ ‘ఊరు పేరు భైరవకోన’ ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ ‘ముఖ్య గమనిక’ ‘సిద్దార్థ్ రాయ్’ ‘సుందరం మాస్టర్’ వంటివి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు మొత్తం కలుపుకొని 50 రిలీజ్ అయ్యాయి.

ఇందులో సక్సెస్ అయిన సినిమాలు కేవలం 2 మాత్రమే కావడం గమనార్హం. అందులో (Ambajipeta Marriage Band) ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ఒకటి కాగా , ‘ఊరు పేరు భైరవకోన’ ఇంకోటి కావడం గమనార్హం. ఇవి కూడా జస్ట్ అలా బ్రేక్ ఈవెన్ అయ్యాయి అంతే. బ్లాక్ బస్టర్స్ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అంటూ ఏమీ లేదు. సో ఫిబ్రవరి డ్రై సీజన్ అని 2024 ఇంకోసారి చాటి చెప్పినట్టు అయ్యింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.